ఈ మధ్యకాలం లో కార్టూనిస్టు లు ఫేస్బుక్ లాంటి మాధ్యమాలలో ఎదుర్కొంటున్న ఒక సమస్య : మన హిందూ పండగల అంశంతో , పురాణాల అంశంతో,దైవ సంబదిక అంశాలతో కార్టూన్లు వేస్తే ...... { ఎ కార్టూనిస్టు పని కట్టుకుని మన సంస్కృతిని కించపరచాలని అలాంటి కార్టూన్ లు వేయడు, హాస్యానికి మాత్రమే అదీ సున్నితంగా, ఆలోచించి వేస్తాడు . } అవి మన సంప్రదాయాన్ని,సంస్కృతిని,దైవాన్ని కించపరుస్థున్నయని, కార్టూనిస్ట్ మన సంప్రదాయకి మచ్చ తెచ్చాడని , నెటిజన్లు లబోదిబో మంటూ .... కార్టూనిస్టు ని నానా దుర్భాశలాడుతూ ..., కించపరిచే పద ప్రయోగాలు చేస్తున్నారు.
కార్టూనిస్టు ఫేస్బుక్ లో పోస్టు చేసిన ఆ కార్టూన్ దాదాపుగా ఏదైనా పత్రికలో లేదా అంతర్జాల పత్రికలో ఆమోదం పొంది ప్రచురితం ఐనదే , అంటే ఒక సర్వజ్ఞుడైన సంపాదకుని ఆమోదం పొందినదే.
ఐన నాకు అర్థం కాదు...... దొంగ వేషాలు వేసి , దేవుడి బిడ్డలమని చెప్పుకుని , స్త్రీలని, పిల్లలని, పెద్దలని , ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ కోట్లు గడిస్తున్న , గడించిన , దొంగ స్వాములని నమ్మి, నమ్ముతూ, నిరంతరం మోసపోతూనే ఉన్నాం . అలాంటి వారు మన సంస్కృతిని , సాంప్రదాయాలను, కించ పరుస్తున్నారు, మన దేవుళ్ళను కించ పరుస్తున్నారు, మోసగాల్లైన స్వాములను గూర్చి ప్రపంచానికి తెలిస్తే, ఆ స్వాములు అప్పటి వరకు చేసిన దైవ ప్రచారం , విదేశీయులకు మన మీద చులకన భావం కలుగజేస్తుంది . అలాంటి వారి పైన మీ కోపాన్ని, దుర్భాశా ప్రయోగాన్ని చేయండి.
అంతే కాని నవ్వించాలని చూసిన కార్టూనిస్టు పైన కాదు .
ఒక వేల మీకు కార్టూన్ నచ్చక పోతే నచ్చలేదు అనండి , దుర్భాష లాడకండి దయచేసి ......
మేము నాస్తికులం కాదు , భారతీయులం పైగా మన సాంప్రదాయాలకు, సంస్కృతికి, దైవానికి అత్యంత విలువనిచ్చే వాళ్ళం .
మేము తెలుగు వాళ్ళం , మేము భారతీయులం . గర్వంగా ............. సగర్వంగా ............