29, జనవరి 2015, గురువారం

ఈ ఫోటో వెనుక చిన్న కథ



ఈ ఫోటో 28-10-2012 వ సంవత్సరం  హైదరాబాద్   పబ్లిక్ గార్డెన్ లో జరిగిన కార్టూన్ ఫెస్టివల్ లో దిగినది .

  ఈ ఫోటో వెనుక చిన్న కథ ,    నాకు అదివరకు ఎ కార్టూనిస్టు తో ప్రత్యక్ష పరిచయం లేదు ,  ఫోటోలలో చూసి కొంత మందిని గుర్తించి పలకరించి , వారితో ఫోటో దిగడం  మాట్లాడడం జరిగింది.                                                              
      అప్పుడే  వచ్చిన గురువు గారు జయదేవ్ బాబు గారిని చూసి , అప్పటికే ఆయన ఫోటో చూసి ఉన్నాను కనుక తేలికగానే గురుతుపట్టాను,   గురువుగారికి నమస్కారం చేసి సర్ మీతో ఒక ఫోటో దిగాలని ఉంది అని అడగడం , గురువుగారు  సరే అనడం , నేను ఆయనతో కలిసి ఫోటో దిగడం , జరిగింది .  అయితే  గురువుగారి  పక్కనే ఉంటూ ఆయనను అనుసరిస్తూ ,  నేను ఫోటో దిగాలని అడిగినపుడు  కోత్తగా  కార్టూన్లు గీస్తున్నారా  ?  అని అడిగిన వ్యక్తిని నేను పోల్చుకోలేక పోయాను ,  అతను గురువుగారి కొడుకు కాబోలు అనుకున్నాను .  ఆయనే  నా ఎడం పక్కన నిలబడి  ఉన్న గీతల  టి షర్ట్  వేసుకుని అటుగా చూస్తున్న వ్యక్తి .

    ఆ తరువాత ఒక సంవత్సర కాలానికి  నేను www.gotelugu.com  వెబ్ మాగజిన్ లో  నా కార్టూన్ పబ్లిష్ అయినపుడు  ఆ టి షర్టు వ్యక్తి ఫోటో చూసాను , ఎంతో ఆశ్చర్యం  ఆయన బన్ను కార్టూనిస్ట్ గారు .  www.gotelugu.com  వెబ్ మాగజిన్ నిర్వాహకులు ,  మంచి కార్టూనిస్ట్ , గొప్ప మనసున్న మంచి మనిషి ,   ఒక సందర్భం లో బన్ను గారితో ఫోన్ లో మాట్లాడినపుడు  , సర్ మీరెవరో నాకు తెలియనపుడే మీతో ఫోటో దిగాను  అని ఈ విషయం ఎంతో  ఉత్సాహంగా ఆయనతో ప్రత్సావించాను ,  అంతే ఉత్సాహంగా ఆయన స్పందించారు .

   ఈ రోజు  ఆయన పుట్టిన రోజు  బన్ను గారు ఇలాంటి పుట్టిన రోజులెన్నో ఆనందంగా జరుపుకోవాలని , చిరకాలం నవ్వుతు ఉండాలని ,  ఆయన చేస్తున్న అన్ని పనులు విజయాల్ని అందించాలని , మనఃపూర్తిగా కోరుకుంటున్నాను .   బన్ను గారు వర్ధిల్లండి .  

4, జనవరి 2015, ఆదివారం

అంతే మీరు డబ్బు సంపాదించడం ఈజీ

            ఆఫీసు నుండి ఇంటికి రాగానే భోజనాది కార్యక్రమాలు ముగించుకుని , సిస్టం ఆన్ చేసి మెయిల్స్ చెక్ చేసుకోవడం అలవాటు .

                అన్ని ఫేస్బుక్ అప్డేట్ మెయిల్స్ , ఒక్కటికూడా పర్సనల్ మెయిల్ లేదు, ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ డిలీట్ చేస్తుండగా , ..... ఒక చోట ఆగాను , ఆ మెయిల్ నన్ను ఎందుకో ఆకర్షించింది .
                "మెయిల్స్ చేయండి డబ్బుసంపాదించండి "
ఎంటాని  ఆత్రుతగా ఓపెన్ చేసాను ,   ' మీరు చేయాల్సిందల్ల  కంపెనీ ప్రోడక్ట్  వివరాలు, ఆలోచనలు , ఆవిష్కరణలు , మెయిల్ చేయడమే .......................... ,  వివరాలకు మీరు మా ఖాతా లో రూపాయలు 500 జమ చేయవలసి ఉంటుంది .    అంటూ ఇంకా వారు చెల్లించే డబ్బు ఏ విధంగా  మనకు అంద జేసేది , ఒక్కో మెయిల్ కి ఎంత చెల్లించేది క్లుప్తంగా వివరించారు .  క్రింద వారి బ్యాంకు ఎకౌంటు నెంబర్ , కంపెనీ వివరాలు, చిరునామా,తదితర వివరాలన్నీ ఒక  పేరాలో తెలిపారు.

            అంత త్వరగా నేను ఎవరిని నమ్మే మనిషిని కాదు గాని,  వారు కూలంకషంగా తెలిపిన కంపని వివరాలు, అడ్రస్, వారి బ్యాంకు ఎకౌంటు నంబరు, తదితరాలన్నీ చూసి ఎందుకో నా మనసుకి కొంత నమ్మకం కలిగింది, 500 లే కదా  కట్టేద్దాం , వారు తెలిపినట్లు మెయిల్స్ చేసి చూద్దాం, ఒక నెల ప్రయత్నిస్తే డబ్బు నిజాయితీగా పంపుతారా లేదా తెలుస్తుంది,  లేదంటే, కంపని వివరాలు ఉండనే ఉన్నాయ్, ఎక్కడికి పోతాడులే.....................

            అనుకున్నదే తడవుగా తెల్లవారి బ్యాంకు లో వారు తెలిపిన ఎకౌంటు లో డబ్బు జమ చేసి  వచ్చి నా ఆఫీసు పనిలో మునిగిపోయాను.

            ఇంటికి వచ్చాకా  మెయిల్ ఓపెన్ చేసి , నేను డబ్బు పంపిన విషయం, నా ఎకౌంటు నెంబర్, నా వ్యక్తిగత వివరాలు, అన్ని తెలుపుతూ నేను డబ్బు కట్టిన సదరు కంపెనీకి మెయిల్ పెట్టాను .

            నిమిషాల్లో నాకు తిరిగి మెయిల్ వచ్చింది.

      " ధన్యవాదములు , శ్రీ నాగావీర గారు, మీరు పంపిన డబ్బు మాకు అందినది ,  ఇక మీరు మేము తెలిపిన ఈ క్రింది వివరాలు అనుసరించడమే తరువాయి, మీరు డబ్బు సంపాదించడం మొదలుపెడతారు. "

        సూచన :1]  మీరు కూడా మాలాగే ఒక తాత్కాలిక బ్యాంకు ఎకౌంటు తీసుకోండి,

                     2]  మీకంటూ ఒక కంపని పేరు , దాని గొప్పలు తెలుపుతూ ఒక ఆర్టికల్ తయారు చేయండి,

                     3]   మా కంపని ప్రమోషన్ చేస్తే డబ్బు చెల్లిస్తాం  అని కాప్షన్ పెట్టండి,

                      4]  మీకు దొరికిన , కనిపించిన ప్రతి మెయిల్ ఐ . డి .,   కి  మెయిల్ పెట్టండి ,

  అంతే ఎవరైనా మీలాంటి ఒక బకరా దొరకక పోడు ,  మీకు డబ్బు పంపక పోడు ,  అంతే మీరు డబ్బు సంపాదించడం  ఈజీ
............................

           డాం ,,,,,,, డాం,,,,,,,, నా గుండెల్లో  పిడుగులు పడ్డంత గా ...... అదిరిపడ్డాను ,  ఈ సంగటన నుండి తేరుకోవడానికి  చాలారోజులు పట్టింది .

             

అన్ని కంప్యూటరే



అన్ని కంప్యూటరే  చూసుకుంటుంది కదా ఇక నాకు మెదడుతో పనేమిటి  అందుకే అందులో పెట్టేసా .............