ఈ ఫోటో 28-10-2012 వ సంవత్సరం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో జరిగిన కార్టూన్ ఫెస్టివల్ లో దిగినది .
ఈ ఫోటో వెనుక చిన్న కథ , నాకు అదివరకు ఎ కార్టూనిస్టు తో ప్రత్యక్ష పరిచయం లేదు , ఫోటోలలో చూసి కొంత మందిని గుర్తించి పలకరించి , వారితో ఫోటో దిగడం మాట్లాడడం జరిగింది.
అప్పుడే వచ్చిన గురువు గారు జయదేవ్ బాబు గారిని చూసి , అప్పటికే ఆయన ఫోటో చూసి ఉన్నాను కనుక తేలికగానే గురుతుపట్టాను, గురువుగారికి నమస్కారం చేసి సర్ మీతో ఒక ఫోటో దిగాలని ఉంది అని అడగడం , గురువుగారు సరే అనడం , నేను ఆయనతో కలిసి ఫోటో దిగడం , జరిగింది . అయితే గురువుగారి పక్కనే ఉంటూ ఆయనను అనుసరిస్తూ , నేను ఫోటో దిగాలని అడిగినపుడు కోత్తగా కార్టూన్లు గీస్తున్నారా ? అని అడిగిన వ్యక్తిని నేను పోల్చుకోలేక పోయాను , అతను గురువుగారి కొడుకు కాబోలు అనుకున్నాను . ఆయనే నా ఎడం పక్కన నిలబడి ఉన్న గీతల టి షర్ట్ వేసుకుని అటుగా చూస్తున్న వ్యక్తి .
ఆ తరువాత ఒక సంవత్సర కాలానికి నేను www.gotelugu.com వెబ్ మాగజిన్ లో నా కార్టూన్ పబ్లిష్ అయినపుడు ఆ టి షర్టు వ్యక్తి ఫోటో చూసాను , ఎంతో ఆశ్చర్యం ఆయన బన్ను కార్టూనిస్ట్ గారు . www.gotelugu.com వెబ్ మాగజిన్ నిర్వాహకులు , మంచి కార్టూనిస్ట్ , గొప్ప మనసున్న మంచి మనిషి , ఒక సందర్భం లో బన్ను గారితో ఫోన్ లో మాట్లాడినపుడు , సర్ మీరెవరో నాకు తెలియనపుడే మీతో ఫోటో దిగాను అని ఈ విషయం ఎంతో ఉత్సాహంగా ఆయనతో ప్రత్సావించాను , అంతే ఉత్సాహంగా ఆయన స్పందించారు .
ఈ రోజు ఆయన పుట్టిన రోజు బన్ను గారు ఇలాంటి పుట్టిన రోజులెన్నో ఆనందంగా జరుపుకోవాలని , చిరకాలం నవ్వుతు ఉండాలని , ఆయన చేస్తున్న అన్ని పనులు విజయాల్ని అందించాలని , మనఃపూర్తిగా కోరుకుంటున్నాను . బన్ను గారు వర్ధిల్లండి .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి