ఫోన్ రింగవుతుంటే తీసి చూస్తును కదా ...... అది గురుదేవులు జయదేవ్ గారినుండి ,
ఉత్సాహంగా, ఆనందంగా, ఫోన్ ఎత్తాను . ఎంతో ఆప్యాయమైన పలకరింపుతో కుశల ప్రశ్నలు అడిగాక , నాగ్రాజ్ నువ్వు ఒక ఐడియా చెప్పు నేను బొమ్మ వేస్తాను అన్నారు , ముందుగా నమ్మలేక పోయాను , తర్వాత ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను , గురువుగారి ఆజ్ఞ , ఆయనంతటి వారికి ఆలోచనలు అందించడమంటే కాస్త భయం .
ఇక ఆ రోజంతా ఒకటే మథనం ................... పరిపరి విధాలుగా అలోచనలు , ఒక పది ఐడియా లు తట్టి వాటిలో నాకు బాగా అనిపించినవి రెండు గురువుగారి ముందు ఉంచాను , అందులో ఒకటి, "క్షీర సాగర మథనం చేస్తుంటే ఒక గంధర్వుడు ప్రత్యక్షం అయ్యి దేవా దానవులారా ..... ఇప్పుడు సాగరంలో కలుషితాలు తప్ప అమృతం లేదు .... " అంటాడు . ఇది ఐడియా గురువుగారు దీని పైన స్పందించి , ఈ ఆలోచనను ఇంకా బాగా సాన పెట్ట మన్నారు , మళ్ళి మథనం ............. మరుసటి రోజు గురువుగారికి ఫోన్ చేసి , "దేవ దానవులు సాగర మథనం చేస్తుంటే చెత్త చెదారం , సముద్రంలో కూలిన ఓడలు , లక్ష్మి, గాయత్రి పైకి లేస్తాయి ..... "
ఈ ఐడియా నేను చెబుతుండగానే ......... గురువుగారు ఒక్క క్షణం ఆగి నాగ్రాజ్ అవన్నీ కాదు , మొన్న కూలిన మలేషియా విమానం పైకి లేస్తే ఎలాఉంటుంది ...... ? అన్నారు . ఇక నేను లాక్ . that is jayadev సార్ .
ఎంత గొప్ప నిశితమైన పరిశీలన ఉంటె అంత అద్బుతంగా ఆలోచించగలరు , అందుకే తెలుగు కార్టూనిస్ట్ లందరికి ఆయన గురువు, దైవం, ఆరాద్యులు , జయదేవులు .
ఈ కార్టూన్లో సాగర మథనం వరకే నా ఆలోచన, మిగతా అంత గురువుగారే, ఆయన బొమ్మలో , విమానం బొమ్మ నా చేత వేయించడమే కాకుండా, నా పేరు కూడా పొందు పరిచి నాకో గుర్తింపు నిచ్చారు. ఇది ఆయన గొప్ప మనసుకి నిదర్శనం . ఇంతటి గొప్ప గురువు దొరకడం నేను పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం .
గురుభ్యోనమః గురుభ్యోనమః గురుభ్యోనమః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి