22, మార్చి 2016, మంగళవారం

శ్రీయుతులు  లేపాక్షి రెడ్డి గారిని నేను మొదట  కార్టూనిస్ట్ శ్రీ బాచి గారి ఇంట్లో కలిసాను , ఆ రోజు ఆయన అందించిన క్రోక్విల్ నిబ్ , రెండు కార్టూన్లు ఎంతో అపురూపంగా దాచుకున్నాను ,  నేను teluguvennela.com  వెబ్ మగజినె లో వేస్తున్న రాబోవు రోజుల్లో ఫీచర్ కార్టూన్ల ని ప్రశంశించడం ఎప్పటికి మరవలేను .


ఆ తరువాత 19 డిసెంబెర్  2015 నుండి 21 డిసెంబెర్ 2015 ,  మూడు రోజుల పాటు  " స్టేట్ ఆర్ట్ గాల్లరి  "  మాదాపూర్ , హైదరాబాద్  లో నిర్వహించిన కార్టూన్ల ప్రదర్శనలో   సర్వశ్రీ  ఎం.ఎస్. రామకృష్ణ , లేపాక్షి, బాచి , సరసి , బండి రవీందర్ , నాగ్రాజ్ ...  మహామహులందరి కార్టూన్ లతో పాటు నా కార్టూన్లు కూడా ప్రదర్శింప జేసే అవకాశం నాకు కల్పించారు ,  అప్పుడు మూడు రోజులు  శ్రీ లేపాక్షి గారిని దగ్గరగా గమనించే అదృష్టం కలిగింది . 

ఆయన సాదారనంగా కనిపించే అసాధారణ మైన వ్యక్తి , ఎంతో ఉన్నతులైనప్పటికి  చాలా సింపుల్ గా ఉంటారు, ఎక్కువగా  అంటే అవసరమైతే తప్ప మాట్లాడరు , అన్ని గమనిస్తూ ఉంటారు ,  కాని చలోక్తులు విసిరారంటే పగలబడి అందరు నవ్వాల్సిందే ,  ఎ విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోరు , ప్రతి విషయం పట్ల పూర్తి అవగాహనతో ఉంటారు . 
ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న శ్రీ లేపాక్షి గారితో కార్టూన్ల ప్రదర్శన లో నేను భాగస్వామిని కావడం నా అదృష్టం . 
ఆర్ట్ గలరిలో  నవ్య వీక్లీ సంపాదకులు శ్రీ జగన్నాధ శర్మ గారి ద్వారా  శ్రీ లేపాక్షి గారిని చంద్రుడికో నూలు పోగులా  సత్కరించుకునే భాగ్యం నాకు కలిగింది . 

సర్ మీరు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను .   

హోలీ పండగ శుభాకాంక్షలు


7, మార్చి 2016, సోమవారం

ఓం నమః శివాయః

ఓం నమః శివాయః

నమ్మకమే జీవితాన్ని
నడిపిస్తుంది ,
ఇది నిజమైనపుడు
ఆ నమ్మకం శివుడేందుకు  కాకూడదు  ?


ఓం నమః శివాయః

శివతత్వం  నా జీవితమైనపుడు
కష్టం  సుఖం
లాభం  నష్టం
వీటికి తేడాలేమిటి  ?

ఓం నమః శివాయః

అడుక్కునే వాడు దేవుడా  ?
ఇదే మీ ప్రశ్నైతే
అడక్కుండా జరిగే పనేదైనా ఉందా
ఈ లోకంలో   . . . .. . . !!!
అదే శివతత్వం
నా జవాబు .

ఓం నమః శివాయః

నీ నామ స్మరణం
నా శ్వాసైనపుడు
నిన్ను తలువ ప్రత్యేకమైన
రోజు కావాలా శివా  ?

ఓం నమః శివాయః

ఆలిని గౌరవిస్తారు ,
నగలిస్తారు , మేడలిస్తారు ,
రాజ్యమిస్తారు . . . .
నువ్వేమిచ్చావయ్య  ?
నీలో సగభాగం . . . . .

ఓం నమః శివాయః
గొంతులో గరళం
నెత్తిన గంగ
గరళం మేము తాగలేము
తాగే గంగను మాకు వదలవయ్య
తరిస్తాము

ఓం నమః శివాయః

ఆద్యంతాలు లేని
సర్వాంతర్యామివి
నాకేం కావాలో నేను కోరేదాకా
నీకు తెలియదంటే నమ్మాలా   ?

ఓం నమః శివాయః

జీవుడే శివుడైతే
నేను చూస్తున్నది
వింటున్నది
మాట్లాడుతున్నది
పోట్లాడుతున్నది
ప్రేమించేది
ద్వేషించేది
అంతా శివాన్నే కదా  ?