7, మార్చి 2016, సోమవారం

ఓం నమః శివాయః

ఓం నమః శివాయః

నమ్మకమే జీవితాన్ని
నడిపిస్తుంది ,
ఇది నిజమైనపుడు
ఆ నమ్మకం శివుడేందుకు  కాకూడదు  ?


ఓం నమః శివాయః

శివతత్వం  నా జీవితమైనపుడు
కష్టం  సుఖం
లాభం  నష్టం
వీటికి తేడాలేమిటి  ?

ఓం నమః శివాయః

అడుక్కునే వాడు దేవుడా  ?
ఇదే మీ ప్రశ్నైతే
అడక్కుండా జరిగే పనేదైనా ఉందా
ఈ లోకంలో   . . . .. . . !!!
అదే శివతత్వం
నా జవాబు .

ఓం నమః శివాయః

నీ నామ స్మరణం
నా శ్వాసైనపుడు
నిన్ను తలువ ప్రత్యేకమైన
రోజు కావాలా శివా  ?

ఓం నమః శివాయః

ఆలిని గౌరవిస్తారు ,
నగలిస్తారు , మేడలిస్తారు ,
రాజ్యమిస్తారు . . . .
నువ్వేమిచ్చావయ్య  ?
నీలో సగభాగం . . . . .

ఓం నమః శివాయః
గొంతులో గరళం
నెత్తిన గంగ
గరళం మేము తాగలేము
తాగే గంగను మాకు వదలవయ్య
తరిస్తాము

ఓం నమః శివాయః

ఆద్యంతాలు లేని
సర్వాంతర్యామివి
నాకేం కావాలో నేను కోరేదాకా
నీకు తెలియదంటే నమ్మాలా   ?

ఓం నమః శివాయః

జీవుడే శివుడైతే
నేను చూస్తున్నది
వింటున్నది
మాట్లాడుతున్నది
పోట్లాడుతున్నది
ప్రేమించేది
ద్వేషించేది
అంతా శివాన్నే కదా  ?
                                                  

కామెంట్‌లు లేవు: