అరుణ్ ....... అరుణ్ ....... లేవరా ...... ఒరేయ్ మొద్దు లేవరా ......, రాత్రులంతా ఫేస్బుక్, వాట్సాప్ , పొద్దున్న తొమ్మిదైనా నిద్రలేవకపోవడం , అబ్బబ్బ వీడితో చస్తున్నాం, వీడినెలా దార్లో పెట్టాలో అర్థం కావడం లేదు, ఉన్నదోక్కగానోక్క కొడుకు కదాని గారం చేస్తే , కంట్లో నలుసులా వీడి బుద్ధి తయారయ్యింది , తీస్తే రాదు తీయకుంటే కన్నీళ్ళు .
అసలు వీడని కాదు , ఏదడిగితే అది , కాదనకుండా ...,ఎలాచేస్తే అలా అడ్డుచెప్పకుండా అడ్డుకున్నారు చూడు మిమ్మల్ననాలి, అంటూ విసవిసలాడుతూ భర్తపైన గయీ మనిలేచింది భారతి .
ఇదేదో తుఫాను లా మరేట్లుందని " అవును ఇవాళ పండక్కి మీ ఇంటికి బయలుదేరదాం అన్నావుకదా గుర్తులేదా" సామలన్ని సర్దు , బయల్దేరదాం , ఒకరోజు ముందైనా వెళ్ళకపోతే మీనానాన్న చిందులేస్తాడు, అన్ని రడిచేసి ఉంచావా . మాట మార్చే ప్రయత్నం చేసాడు భూషణం .
మాట మార్చకండి ..... చూడండి ...... చూడండి ......... ఇప్పుడే లేచాడా ...... నోట్లో బ్రష్ వేసుకుని ..... అదిగో నోరు బావురుకప్పలా తెరిచి , సెల్ఫి తీసుకుంటున్నాడు , అదిప్పుడు ఫేస్బుక్ లో పెట్టడం , దానికి ఎన్ని లైకులు , కంమెంట్లు , వచ్చాయో చూడడం , పొద్దస్తమానం ఇదే పనివాడికి , ఒక్కసారన్న మందలించారా , ఇలాగైతే వాడి చదువు చంక నాకి పోతుంది , ఇకనైనా ఈ గారాబాలు ఆపి వాడు దారిలో పడే మార్గం ఆలోచించడి .
ఇంతలా అరుస్తున్న భారతికేసి చూస్తూ చిన్న పిల్లాడు , పోనిలేవే ఏదో సరదా, ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు చెప్పు . కొడుకు వాలకానికి చీమకుట్టినట్టైనా లేదు భూషనానికి .
ఈయనకు చేప్పాను చూడు ..... నాది బుద్ధి తక్కువ ....... గోనుక్కుకుంటూ వెళ్లి ప్రయాణానికి ఏర్పాట్లు చేయసాగింది భారతి .
* * *
పల్లెటూరు , అరుణ్ సేల్ఫిలకి , ఫేస్బుక్ అప్ లోడ్ లకి కొదవే లేదు, కనిపించి ప్రతిచోట నిలబడ్డం ఒక సెల్ఫి తీసుకోవడం ఫేస్బుక్ లోనో , వాత్సప్ లోనో పెట్టడం, కామెంట్స్ చూడడం , ఇదేపని వాడికి, తాతయ్య,అమ్మమ్మ,అత్తా,మామ,మరదలు, ఎవరిని వదలలేదు, అందరితో సేల్ఫిలు తీయడం, సెల్ఫి అంటే ఏంటని అడిగినవారికి ఓ గంట సేపు స్పీచ్, ఇక వేరే పనిలేకుండా రోజుల్లన్ని, ఫేస్బుక్ తోనే గడిపేస్తున్నాడు, ఒక మాటా లేదు, ముచ్చటా లేదు, ప్రేమగా ఎవరితో , ఒక రోజు గడిపింది లేదు, ఇదంతా చూస్తున్న భారతికి అరుణ్ వాలకం సుతారము నచ్చలేదు, మనసుకి బారంగా తోచింది, ఏదోకటి చేసి అరున్లో మార్పు తీసుకు రాకపోతే సహజ సిద్దమైన ఆనందాలన్నీ కోల్పోయి , యంత్రంలా మారిపోతా డెమో అనిపించింది, అనిపించండం కాదు , అది నిజం కూడా .................
* * *
ఆ రోజు సంక్రాంతి, ఊరంతా రంగవల్లులతో , గంగిరెద్దుల వారితో, హరిదాసుల కీర్తనలతో, తుపాకి రాముడి దామ్బికాలతో, కోడిపందాలతో , కోలాహలంగా సందడి గా ఉంది, అరుణ్ మరదలు ఉష వాకిట్లో ముగ్గు పెట్టి రంగులద్దుతుంది, అరుణ్ ఆ ఫోటోలు తీస్తూ, ఫేస్బుక్ లో పెడుతున్నాడు, ఎన్ని లైకులు పడ్డాయో చెబుతున్నాడు, గొబ్బెమ్మలు తీసుకుని వస్తూ భారతి ఉషాకి ఏదో సంజ్ఞ చేసింది, రంగవల్లికి రంగులు వేయడం పూర్తి చేసి గొబ్బెమ్మలు పెట్టింది .
బావా ఒకసారి నీ ఫోనివ్వవా ముగ్గుతో ఒక సెల్ఫి తీసుకుంటాను ప్రేమగా అడిగింది అరుణ్ ని ఉష,
సెల్ఫి తీసుకుంటానంటే వద్దంటాన ఇదిగో అంటూ ఆనందంగా మరదలి చేతుకి అందించాడు ఫోన్,
ముగ్గు దగ్గర, గొబ్బెమ్మకి దగ్గరగా, రకరకాలుగా సేల్ఫిలు తీసుకుని బావకి ఫోన్ అందిస్తూ, నేను తీసు కున్నంత అందంగా నువ్వు సేల్ఫిలు తీసుకోలేవు బావా , నా సేల్ఫిలు చూడు ఎంత అందంగా ఉన్నాయో, అంటూ అరుణ్ ని ఉడికించినది...................... అసలే సేల్ఫిల పిచ్చి పట్టిన అరుణ్ నాకు సెల్ఫి గుంరించి చెబుతున్నావా అసలు సెల్ఫి లలో ఎన్ని ప్రయోగాలు చేసానో తెలుసా నీకు , నా సేల్ఫిలకు వందల్లో లైకులు పడతాయ్ తెలుసా ........ ఏ అంగెల్ లో సెల్ఫి తీయమంటావో చెప్పు క్షణాల్లో తీసి ఫసుబూక్లో పెడతాను, మనిద్దరిలో ఎవరి ఫోటోకి ఎక్కువ లైకులు పడతాయో చూద్దాం . త్వరగానే ఉష పన్నిన వలలో పడ్డాడు అరుణ్ .
అయితే గొబ్బెమ్మకి దగ్గరగా ముఖం పెట్టి ఫోటో తీసుకోవాలి , ఎవరు ఎక్కువ దగ్గర పెడతారో , ఎవరి ఫోటో లో ముఖం ముగ్గుకి దగ్గరగా వస్తుందో వారు విన్నర్స్ . ఉడికించినది ఉష .
సరే అయితే ఫస్ట్ నువ్వు , పురమాయించాడు అరుణ్ , ఉషని .
ఉష ఏదోలా తన వంతు ముగించింది , ఇప్పుడు అరుణ్ వంతు , అరుణ్ సేల్ఫిలు తీసుకుంటున్నాడు , ముగ్గుకి దగ్గరగా ముఖం పెట్టాడు , బావా ఇంకా దగ్గరగా రావాలి , నేను తీసుకున్నంత దగ్గరకి రావడం లేదు , ఇంకా, ఇంకా, అంటూ ఉడికించ సాగింది ఉష, ఒకచేతులో ఫోన్ ఒక చేయి నేలని ఆన్చుతూ వంగుతున్నాడు అరుణ్ ,
ఒక్క సారిగా పట్టు తప్పింది, సరిగ్గా వెళ్లి ముఖం గొబ్బెమ్మ కేసి వత్తుకున్నాడు , అప్పుడే పెట్టిన గొబ్బెమ్మ పచ్చిగా ఉంది , ముఖమంతా పేడ , పట్టు తప్పి పడిపోతున్న ఫోన్ ని ఉష అందుకుంది, అరుణకి తెలియ కుండా గొబ్బెమ్మ పైన పడ్డప్పుడు, ముఖమంతా పేడతో, రకరకాలుగా అరుణ్ ఫోటోలు తీసి , ఫేస్బుక్ లో, వాత్సాప్లో అప్లోడ్ చేసింది, దానికి మంచి టైటిల్ కూడా పెట్టింది " సెల్ఫి గొబ్బెమ్మ " అని .
ముఖం కడుక్కుని బాత్రూం నుండి బయటికి వస్తున్న అరుణ్ దగ్గరికి వస్తు ఉష , బావా చూడు చూడు , నీ ఫోటోని ఫేస్బుక్ లో పెడితే ఎన్ని లైకులో .......... ఎన్ని కంమెంట్లో .........,
సెల్ఫి గొబ్బెమ్మ .., పేడ ముఖం, గొబ్బెమ్మ కింగ్, పేడ అరుణ్, గొబ్బెమ్మ అరుణ్, హహహ , హహహ, ఎన్ని కామెంట్లో ........ చూడు చూడు బావా ........, అంటూ ఉష చదువుతుంటే ఇంట్లో వాళ్ళంతా ఒక్క సారిగా గోళ్ళు మని నవ్వు అందుకున్నారు .
అందరు నవుతుంటే సిగ్గుతో తల వంచు కున్నాడు అరుణ్, కోపంతో ముఖం ఎర్ర బారింది, ఎవరు పెట్టారు నా ఫోటోలు, అంటూ ఉష చేతులోంచి ఫోన్ అందుకుని , నేలకేసి గాట్టిగా కొట్టాడు ఫోన్ ని , రుస రుస లాడుతూ బయటికి నడిచాడు , అరుణ్ ని అనుసరిస్తూ ఉష పరిగెత్తింది ....................
బావా.............. బావా.................. ఉష పిలుస్తున్న ఆగకుండా వెళ్తున్నాడు అరుణ్, పరుగున వెళ్లి అరుణ్ చేయి పట్టి ఆపింది ఉష .
దీనికంతటికి కారణం అత్తయ్యే బావా .................
ఏంటి అమ్మ అంటూ ఆగాడు అరుణ్,
అవును బావా ..., పొద్దస్తమానం నువ్వు ఫోన్ లోనే ముఖం పెట్ట్టుకుని , ఎవరితో మాట్లాడకుండా , ఎంత సేపు ఫేస్బుక్,వాత్సాప్ , చాటింగ్ , ఇంట్లో సరదాలతో పనిలేకుండా, ఇంట్లో వార్తో మాట్లాడకుండా , అసలు తిండికూడా వేలకి తినకుండా , ఫోన్ ప్రపంచంగా .......... నిజమైన సరదాలు , బంధాలు , ఆప్యాయతలు, ప్రేమలు, ఆనందాలు పోగొట్టుకున్తున్నావ్ బావా , నీతో ఈ అలవాటు మాన్పించాలనే అత్తయ్య ఈ ఐడియా చేసింది, నేను దానిలో పావును మాత్రమే , ఇప్పుడు జరిగిన విషయాలన్నీ మరచిపో , నాతో ఈ రెండు రోజులు పండగ అంతా నాతో గడుపు, నిజమైన ఆనందం నేను నీకు చూపిస్తాను బావా ..................... అరుణ్ ని బుజ్జగించింది ఉష .
అమ్మాయి చెప్పాక కాదంటారా ఈ ఫేస్బుక్ జనరేసన్ ........................ మరదలిని అనుసరించాడు అరుణ్ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి