విజయవంతమైన కార్టూన్ ల ప్రదర్శన
సర్వశ్రీ ఎమ్. ఎస్. రామకృష్ణ, బాచి , సరసి , లేపాక్షి , బండి రవీందర్, నాగ్రాజ్ గార్లు ఆరుగురు కార్టూనిస్టుల సంకల్పం కృషి వెరసి మాదాపూర్ " స్టేట్ ఆర్ట్ గ్యాలరి " కావూరి హిల్స్ , హైదరాబాద్ లో నిర్వహించిన కార్టూన్ల ప్రదర్శన విజయవంత మైంది .
తేది 19 డిసెంబెర్ నుండి 21 డిసెంబెర్ వరకు నిర్వహించిన ఈ కార్టూన్ల ప్రదర్శనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ బి. వెంకటేశ్వర్లు i.a.s. , గారు జ్యోతి వెలిగించి ప్రారంబించారు , ఈ కార్యక్రమంలో ఆర్ట్ గ్యాలరి డైరెక్టర్ శ్రీ మనోహర్ గారు, శ్రీ దైవజ్ఞ శర్మ గారు, ప్రముఖ కార్టూనిస్టులు సర్వశ్రీ E R M రాజు గారు,అరుణ్ గారు,వర్చస్వి గారు ,రామ్ శేషు గారు , నూకాపతి గారు, హరికృష్ణ గారు, కొండ రవి ప్రసాద్ గారు, ప్రముఖ చిత్రకారులు బాలు గారు , వాసు గారు , వేగి రాజు సుబ్బరాజు గారు, కార్టూన్ ఇష్టులుమచిలీ పట్నం పామరు కృష్ణ గారు, జి సి పద్మాదాస్ గారు, A R సుధాకర్ గారు పాల్గొన్నారు .
ప్రదర్శనలో ఉంచిన కార్టూన్లను తిలకించిన శ్రీ బి . వెంకటేశ్వర్లు ఐఏఎస్ ముఖ్య అతిథి గారు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు, ఇంతటి అద్బుతమైన ప్రదర్శనని నిర్వహించిన ఆరుగురు కార్టూనిస్ట్ లను మనసారా అభినందించారు , కార్టూన్ అనేది ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని అది ఎంతో తెలివితో , ఆలోచనతో వేయవలసి ఉంటుంది అని వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జరగాలని కోరుకున్నారు . అరగంట మాత్రమే సమయం కేటాయించిన ఆయన ప్రదర్శనను తిలకిస్తూ , ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ తొంబై నిమిషాలు అక్కడే గడిపారు .
ఆహ్వానితులందరికి టీ , బిస్క్ ట్లు ఏర్పాటు చేసారు .
ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన కార్టూనిస్టు లు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు , ప్రతి ఒక కార్టూనిస్ట్ ఇలాంటి ప్రదర్శనను నిర్వహించాలని అభిలషించారు , ప్రదర్శనలకు సంబంధించి ఎన్నో విలువైన సలహాలు సూచనలు , కార్టూన్ వేసే విధానం గూర్చి ఎంతో సమాచారాని శ్రీ ERM రాజు గారు అందించారు , ప్రముఖ చిత్రకారులు సర్వశ్రీ బాలు గారు , వాసు గారు, చిత్ర గారు, ఆనంద్ గారు, వేగిరాజు సుబ్బరాజు గారు తమ సంతోషాన్ని వ్యక్త పరిచారు, తమ అభిప్రాయాలను విసిటేర్స్ లిస్టులో పొందుపరిచి ఆనందంగా వెనుతిరిగారు .
సిని దర్శకులు శ్రీ ముళ్ళపూడి వర గారు, శ్రీ గాంధి గారు , ఈ ప్రదర్శన మాకెంతో నావ్వుల్ని ఆలోచనలని పంచింది అన్నారు .
ప్రముఖ కార్టూనిస్టు బన్ను గారు ప్రదర్శనని సందర్శించి అందర్నీ ఉత్సాహ పరిచారు ,
పెద్దలే కాకుండా పిల్లలు కూడా ప్రదర్శనకి రావడం కార్తూన్లని ఎంజాయ్ చేయడం ప్రదర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది , ప్రదర్శనకి తిలకించడానికి వచ్చిన పిల్లలు ,పెద్దలు , స్త్రీలు , సీనియర్ సిటిజెన్లు అందరు ఎంతో ఆనందాన్ని , ఉత్సాహాన్ని మూటగట్టుకుని తమ అభిప్రాయాన్ని విసిటేర్స్ లిస్టు లో వారి ఆనందాన్ని వ్రాసి ఎన్నో నవ్వుల్నీ మోసుకెళ్ళారు . శ్రీ బాచి గారి హాస్య రస కార్టూన్లు, శ్రీ సరసి గారి అపార్ట్ మ్మేంట్ కార్టూన్ లు , నాగ్రాజ్ గారి మెసేజ్ కార్టూన్ లు ,శ్రీ బండి రవీందర్ గారి చమత్ కార కార్టూన్ లు , శ్రీ రామకృష్ణ గారి నావ్వుల పువ్వుల కార్టూన్ లు , శ్రీ లేపాక్షి గారి పంచ్ కార్టూన్ లు అందరి సందర్శకులను హత్తుకున్నాయి .
కార్టూన్ ఇష్టులు ఫేస్ బుక్ గ్రూప్ లలో కార్తూన్లని ప్రేమించే సర్వశ్రీ జే సి పద్మదాస్ గారు , శ్రీనివాస రావు వేముగంటి గారు , ముమ్మిడి పద్మిని గారు, ప్రతిభ అంచ గారు, వేణుగోపాల్ నెల్లుట్ల గారు ఆనంద డోలికల్లో తేలి పోయారు .
ప్రదర్శనకి విచ్చేసిన నవ్య వీక్లీ సంపాదకులు ప్రఖ్యాత రచయిత శ్రీ జగన్నాధ శర్మ గారు కార్టూన్ లని తిలకించి ఎంతో ఉత్సాహంగా వారి అభిప్రాయాలను వ్యక్త పరిచారు, ఎంతో విలువైన వారి సమయాన్ని కేటాయించి , వారి అనుభవాలను , ఆలోచనలను, పంచుకున్నారు ప్రదర్శకులతో ఉల్లాసంగా గడిపి చిరు సత్కారాన్ని స్వీకరించి , మీతో నాలుగ్గంటలు యిట్టె గడిపానంటే నమ్మలేక పోతున్న భలే సంతోషం అని వారు అనడం కొస మెరుపు .
కార్టూన్ల ప్రదర్శన ఆరంభం నుండి చివరిదాకా ప్రదర్శకులలో ఒకరైన శ్రీ బాచి గారి శ్రీమతి శాంతి గారు, కూతురు మధు గారు, చిన్నారి కార్టూనిస్టు గాయత్రి వారి సహాయాన్ని అందిచడం ముదావహం .
మొత్తానికి ఈ కార్టూన్ల ప్రదర్శన విజయవంతమై ఎంతో మంది కార్టూనిస్టుల లో ఉత్సాహాన్ని , అందాన్ని , ప్రేరణని కలిగించింది . మరిన్ని కార్టూన్ ప్రదర్శనలు జరగడానికి ప్రేరణగా నిలిచింది .
నాలాంటి యువ కార్టూనిస్టు లకు మహామహులైన సర్వశ్రీ ఏం. ఏశ్. రామకృష్ణ గారు, సరసి గారు, బాచి గారు, లేపాక్షి గారు, బండి రవీందర్ గార్ల ప్రోత్సాహం, వారి ప్రేమ , ఆదరణ , వారి ఆలోచనలు నాకు వారి పైన ఉన్న గవురవాన్ని రెట్టింపు చేసాయి , నా బాటకు కొత్త వెలుగుని ప్రసాదించాయి .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి