21, ఆగస్టు 2017, సోమవారం

నేను...

మస్తిష్కానికి  హృదయానికి పొసగదెప్పుడు
హృదయం నిండా నింగిని తాకాలని
ఎగిరే కెరటాలే
అవెప్పటికి నింగిని తాకలేవని
వెక్కిరించే  నిరాశా పురుగు మెదడు

తుఫాను గాలికి ఎదురీదే పక్షి...., మనసు
ఆ రెక్కల శక్తిని వెనక్కి లాగే
మిత్రద్రోహి మెదడు

మనోమస్తిస్కాల   వైరాన్ని  సమన్వయ పరిచే
చుక్కానినై  నేను.....
 జీవిత నౌకా ప్రయాణం లో
ఆటు పోటుల అల ల కళ్ళోలా లను
సమన్వయ పరుస్తూ
మనసు తో మస్తిష్కానికి.....
మస్తిష్కం తో మనసుకు కళ్ళెం వేస్తూ
జీవ సముద్ర తీరాలు చేర ,
 పోరాటం చేస్తున్న నేను........

13, మార్చి 2017, సోమవారం

ధన్యోస్మి సర్ ధన్యోస్మి........

కార్టూనిస్టు శ్రీమతి పద్మ గారి కార్టూన్ పోటి బహుమతి తీసుకోడానికి విజయవాడ వెళ్ళి నపుడు గురు సమానులు కార్టూనిస్టు వ్యాపారవెత్త శ్రీ Avm Cartoonist గారిని కలిసె భాగ్యం కలిగింది, ఎంతో ఆత్మియంగా ఆయన పలకరింపు , ఎలాంటి భెషజం లేని ఆయన మాట తీరు , మా తండ్రి గారంత వయసు ఆయనది అయినప్పటికి ఆయన నాతో మాట్లాడిన తీరు , గొప్పవారికి మాత్రమే అలాంటి నడత అలవడుతుందేమొ , ఉన్నంత సెపు ఆయన కార్టూనులతో ప్రయాణం , ఫొటొ షాప్ లొ మెలకువలు, బొమ్మలు వెసె విధానం , పుస్తక ప్రచురణ లొ సాధక బాధకాలు, వ్యాపారం మెలకువలు ....... ఒకటేమిటి ఎన్నొ విషయాలు చర్చించారు , ఆ రోజు నా జన్మలొ మరచి పోలేని రోజు .........గోదవరి నది నీళ్ళు క్రిష్ణ మ్మ లొ కలసి పులకించి నట్లు , బెజవాడ దుర్గమ్మ నిజరూపంలో వచ్చి ఆశీర్వదించి నట్లు అమితానందాన్ని పొందాను .... ధన్యోస్మి సర్ ధన్యోస్మి........



i got first prize