మస్తిష్కానికి హృదయానికి పొసగదెప్పుడు
హృదయం నిండా నింగిని తాకాలని
ఎగిరే కెరటాలే
అవెప్పటికి నింగిని తాకలేవని
వెక్కిరించే నిరాశా పురుగు మెదడు
తుఫాను గాలికి ఎదురీదే పక్షి...., మనసు
ఆ రెక్కల శక్తిని వెనక్కి లాగే
మిత్రద్రోహి మెదడు
మనోమస్తిస్కాల వైరాన్ని సమన్వయ పరిచే
చుక్కానినై నేను.....
జీవిత నౌకా ప్రయాణం లో
ఆటు పోటుల అల ల కళ్ళోలా లను
సమన్వయ పరుస్తూ
మనసు తో మస్తిష్కానికి.....
మస్తిష్కం తో మనసుకు కళ్ళెం వేస్తూ
జీవ సముద్ర తీరాలు చేర ,
పోరాటం చేస్తున్న నేను........
హృదయం నిండా నింగిని తాకాలని
ఎగిరే కెరటాలే
అవెప్పటికి నింగిని తాకలేవని
వెక్కిరించే నిరాశా పురుగు మెదడు
తుఫాను గాలికి ఎదురీదే పక్షి...., మనసు
ఆ రెక్కల శక్తిని వెనక్కి లాగే
మిత్రద్రోహి మెదడు
మనోమస్తిస్కాల వైరాన్ని సమన్వయ పరిచే
చుక్కానినై నేను.....
జీవిత నౌకా ప్రయాణం లో
ఆటు పోటుల అల ల కళ్ళోలా లను
సమన్వయ పరుస్తూ
మనసు తో మస్తిష్కానికి.....
మస్తిష్కం తో మనసుకు కళ్ళెం వేస్తూ
జీవ సముద్ర తీరాలు చేర ,
పోరాటం చేస్తున్న నేను........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి