7, మార్చి 2016, సోమవారం

ఓం నమః శివాయః

ఓం నమః శివాయః

నమ్మకమే జీవితాన్ని
నడిపిస్తుంది ,
ఇది నిజమైనపుడు
ఆ నమ్మకం శివుడేందుకు  కాకూడదు  ?


ఓం నమః శివాయః

శివతత్వం  నా జీవితమైనపుడు
కష్టం  సుఖం
లాభం  నష్టం
వీటికి తేడాలేమిటి  ?

ఓం నమః శివాయః

అడుక్కునే వాడు దేవుడా  ?
ఇదే మీ ప్రశ్నైతే
అడక్కుండా జరిగే పనేదైనా ఉందా
ఈ లోకంలో   . . . .. . . !!!
అదే శివతత్వం
నా జవాబు .

ఓం నమః శివాయః

నీ నామ స్మరణం
నా శ్వాసైనపుడు
నిన్ను తలువ ప్రత్యేకమైన
రోజు కావాలా శివా  ?

ఓం నమః శివాయః

ఆలిని గౌరవిస్తారు ,
నగలిస్తారు , మేడలిస్తారు ,
రాజ్యమిస్తారు . . . .
నువ్వేమిచ్చావయ్య  ?
నీలో సగభాగం . . . . .

ఓం నమః శివాయః
గొంతులో గరళం
నెత్తిన గంగ
గరళం మేము తాగలేము
తాగే గంగను మాకు వదలవయ్య
తరిస్తాము

ఓం నమః శివాయః

ఆద్యంతాలు లేని
సర్వాంతర్యామివి
నాకేం కావాలో నేను కోరేదాకా
నీకు తెలియదంటే నమ్మాలా   ?

ఓం నమః శివాయః

జీవుడే శివుడైతే
నేను చూస్తున్నది
వింటున్నది
మాట్లాడుతున్నది
పోట్లాడుతున్నది
ప్రేమించేది
ద్వేషించేది
అంతా శివాన్నే కదా  ?
                                                  

28, ఫిబ్రవరి 2016, ఆదివారం

నీ ఇంటి వైపు దారి

ముఖం పై చల్లు కుందామని 
దోసిట్లో నీళ్ళు తీసుకుని ఆగాను 
నీటిలో నీ ప్రతిబింబం.   
జుట్టు సర్డుకున్దామని 
అద్దం ముందు నిలబడితే 
అద్దంలో నిలువెత్తు నువ్వే . 
 ఏమి తోచడం లేదు ,
టి వి ఆన్ చేసాను  వార్తలు చదువుతూ నువ్వే . 
ఒరేయ్ రాజు   టీ   పెట్టాను తీసుకున్డువు గాని రా,
నీగొంతు .  
వంటింట్లోకి  నువ్వెప్పుడు దూరావ్ ...? 
బిత్తిరి చూపులు చూస్తావెంట్రా ....?  అమ్మ . 

నీ పిచ్చి పట్టింది ,
అలా బయటికి వెళ్తే  కుదుట పడతానేమో 
వీధిలో నడుస్తున్నాను ......  
నీ ఇంటి వైపు దారి తప్ప ఏమి కనిపించడం లేదు . . . . . . . . !!!!

చేరలేదు .........

రేపు కలుద్దామని సూరీడు  దుప్పటి కప్పు కున్నాడు
పశువులన్నీ పాకల్లో దూరాయి
గువ్వలన్ని గూడు చేరాయి
ఊరు పక్క పరిచింది

ఉదయం గుళ్ళో
నీ దగ్గరే నిలచిపోయిన
నా మనసు ఇంకా నన్ను చేరలేదు ......... 

12, జనవరి 2016, మంగళవారం