19, జూన్ 2020, శుక్రవారం

యూట్యూబ్ ఛానల్ nagraj cartoons

*ఉచితంగా వీడియో పాఠాలు- కార్టూన్లు గీయడం నేర్చుకోండి..కార్టూనిస్టవ్వండి*
*******

కార్టూనులు నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులకు తెలుగులో సరళంగా,సులభమైనశైలిలో వివరిస్తూ చేసిన 10 వీడియోల సమాహారం. నాకు తెలిసి తెలుగులో ఇలాంటి వీడియోలతో కూడిన ఛానల్ ఇదే మొదటిది.
కొత్తవారికి
ఇవి కచ్చితంగా ఉపయోగకరమైన వీడియోలు.
అత్యంతసులభశైలిలో కార్టూనులు వేసే విధానాన్ని వివరించిన ఈ వీడియోలు చూసి మీరు కార్టూను బొమ్మలు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మంచి బొమ్మలతో కూడిన కార్టూనులు  వేయడం గ్యారంటీ, అందుకు నేను హామీ.
ఇవే కాకుండా ప్రతి వారం కొత్త కొత్త అంశాలతో మీ కోసం రూపొందించే వీడియోలకోసం నా ఛానల్
#nagrajcartoons  ని subscribe చేసుకుని గంట సింబల్ నొక్కడం మరవకండి

...మీ నాగ్రాజ్ ..

https://www.youtube.com/playlist?list=PLEfxk5aR1lJPq2SlqWIvYmiLcnsBSVPOm

12, జూన్ 2020, శుక్రవారం

nagraj cartoons


కార్టూన్స్ ఎలా వేయాలి అనే శీర్షికలో ఇది ఏడవది.
కార్టూన్ వ్యక్తులను ఎలా వేయాలి?
చాలా సులభమైనపద్దతిలో తెలియపరిచే వీడియో.
https://youtu.be/uJ0ET68oYaE
Please subscribe
#nagrajcartoons

6, జూన్ 2020, శనివారం

వెయ్యి లైకులంటే ఆనందమే గా...

ఇన్ని సంవత్సరాలు కార్టూనులు ఫెస్బుక్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నగాని ఇప్పటివరకు ఒక్క కార్టూను కూడా రెండు మూడు వందల లైకులకంటే ఎక్కువ దాటలేదు, బహుమతి వచ్చిన కార్టూనులకు కూడా అంతే....
మొట్టమొదటి సరిగా ఈ కార్టూను హస్యానందం గ్రూపులో వెయ్యికి పైగా లైకులు నూటముప్పయికి పైగా షేర్ లతో దూసుకుపోయింది. 
ఆనందమే కదా! 
గ్రూపు సభ్యులందరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదములు.
మీ ఆదరాభిమానాలు ఇంతకన్నా ఏమివ్వగలను మరో కార్టూను తప్ప.
🙏🙏🙏🙏



5, జూన్ 2020, శుక్రవారం

సహజీవనం

కరోనాతో కలిసి బ్రతకాల్సిందే అని ప్రభుత్వాలు ప్రకటించాయి. 
భౌతికదూరం పాటిస్తూ, తగిన జాగర్తలు తీసుకుంటూ
కరోనాతో సహజీవనం చేయాల్సిందే మరో మార్గం లేదు,మందు కనిపెట్టేవరకు తప్పదు అంటూ ఆర్టికవేతలు,డాక్టర్లు, సమాజిక వేత్తలు, నిపుణుల సలహా.
మనం జాగర్తలు పాటిస్తున్నామా? 
కరోనాకి భయపడుతున్నామా? ఈజీగా తీసుకుంటున్నామా! 
ఈజీగా తీసుకుంటున్నామనే చెప్పాలి ఎందుకంటే
లాక్డౌన్ ఉన్న సమయంలో వందల్లో ఉన్న కేసులు సడలింపులు ఇస్తున్నకొద్దీ పెరగసాగాయి ఎంతగా అంటే పదిహేను రోజుల్లో లక్ష పాజిటివ్ కేసులు నమోదయ్యే అంత.

కరోనాతో సహజీవనం చేయాలిసిందే అన్నమాటని మనం తూచా తప్పకుండా పాటిస్తున్నామన్నమాట.😂😂😂😂

4, జూన్ 2020, గురువారం

మనవత్వమా ఏది నీ చిరునామా

ఏనుగమ్మ ఏనుగు అంటూ నాన్న వీపుమీద ఎక్కి ఆడుకున్న మధురమైన జ్ఞాపకం. అమ్మమ్మ గజేంద్రమోక్షం కథ చెబుతుంటే ఏనుగు ఎపిసోడ్ ఎక్కడ మిస్సవుతామో అని చెవులు రెండు అమ్మమ్మ నోటికి అప్పజెప్పి ఉత్కంఠగా విన్న రోజులు....., మా దృష్టిలో ఏనుగు ఒక హీరో, ఏనుగు ఒక రోల్ మోడల్, ఏనుగెక్కి ఊరేగిన రాజుల కథలు,ఏనుగులు తొండంతో ఒక్క దెబ్బకి కొండంత చెట్టుని నేలమట్టం చేసే సాహస కథలు. ఏనుగంటే పూజ్యభావం బాల్యంలోనే మాలో విత్తుకుంది. డి.డి. లో ఆదివారం "హతి మేరీ సాథి" ఎన్ని సార్లు ప్రసారం అయితే అన్ని సార్లు చూసేవాళ్ళం హిందీ రాకపోయినా. సినిమా నచ్చి కాదు,హీరో కోసం కాదు. కేవలం ఏనుగుకోసం,
అంతే.
ఏనుగంటే ఆరాధన అలాంటిది. 
కేరళలో పైనాపిల్ లో మందుగుండు నింపి తినిపించారంట, అది పేలి ఏనుగు మరణం. అసలు అలా ఎలా? అంత క్రూరత్వం ఏమిటి?  మూగజీవలతో వికృత క్రీడలా? అదీ గర్భంతో ఉన్న ఏనుగు.  ఎటుపోతున్నాం?  మానవతా విలువలు ఎక్కడ పాతర వేసాము.
నా కన్నీటి ధారల్లో ఏనుగు నోటినుండి స్రవిస్తున్న రక్తం.


https://youtu.be/xcqTHxXV9oE