ఏనుగమ్మ ఏనుగు అంటూ నాన్న వీపుమీద ఎక్కి ఆడుకున్న మధురమైన జ్ఞాపకం. అమ్మమ్మ గజేంద్రమోక్షం కథ చెబుతుంటే ఏనుగు ఎపిసోడ్ ఎక్కడ మిస్సవుతామో అని చెవులు రెండు అమ్మమ్మ నోటికి అప్పజెప్పి ఉత్కంఠగా విన్న రోజులు....., మా దృష్టిలో ఏనుగు ఒక హీరో, ఏనుగు ఒక రోల్ మోడల్, ఏనుగెక్కి ఊరేగిన రాజుల కథలు,ఏనుగులు తొండంతో ఒక్క దెబ్బకి కొండంత చెట్టుని నేలమట్టం చేసే సాహస కథలు. ఏనుగంటే పూజ్యభావం బాల్యంలోనే మాలో విత్తుకుంది. డి.డి. లో ఆదివారం "హతి మేరీ సాథి" ఎన్ని సార్లు ప్రసారం అయితే అన్ని సార్లు చూసేవాళ్ళం హిందీ రాకపోయినా. సినిమా నచ్చి కాదు,హీరో కోసం కాదు. కేవలం ఏనుగుకోసం,
అంతే.
ఏనుగంటే ఆరాధన అలాంటిది.
కేరళలో పైనాపిల్ లో మందుగుండు నింపి తినిపించారంట, అది పేలి ఏనుగు మరణం. అసలు అలా ఎలా? అంత క్రూరత్వం ఏమిటి? మూగజీవలతో వికృత క్రీడలా? అదీ గర్భంతో ఉన్న ఏనుగు. ఎటుపోతున్నాం? మానవతా విలువలు ఎక్కడ పాతర వేసాము.
నా కన్నీటి ధారల్లో ఏనుగు నోటినుండి స్రవిస్తున్న రక్తం.
https://youtu.be/xcqTHxXV9oE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి