15, ఏప్రిల్ 2015, బుధవారం

నేను ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో మా తెలుగు మాస్టారు  కీర్తి శేశులు శ్రీ డి . వి . మురళి మొహనాచారి గారు,
తెలుగు పాఠాలు అద్భుతంగా చెప్పే వారు, ఆయన పద్యం పాడుతుంటే , పక్క గదిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు  వారి పాఠం ఆపి మరీ పద్యం వినేవారు .

ఆయన ఎన్నో పద్య , గద్య, రచనలు చేసారు .  ఆయన వ్రాసిన "  ఆళ్వారుల  చరిత్ర  "   డి . డి . 8 లో  ధారావాహికంగా  ప్రసారం అయింది ,  ఒక ఎపిసోడ్ లో నటించారు  కూడా .

ఆ మహాను భావుడు  వ్రాసిన  " భీమా ఏజెంట్  భీమా రావు  "   నాటికలో నేను భీమారావు గా నటించాను ,  దానికి  ఉత్తమ  నటుడు, బహుమతి కూడా గెలుపొందాను ,  గురువుగారి ఫోటో నాకు అందుబాటులో లేదు . మిత్రుల దగ్గర ఉంటె పోస్ట్ చేయ గలరు .

అలాంటి   ప్రభావ పూరితమైన, మార్గ దర్శక గురువులు  కొద్ది మందే ఉంటారు , అలాంటి వారికి పాదాభి వందనం .

గురుబ్యోనమః



10, ఏప్రిల్ 2015, శుక్రవారం

ఒక ఆలోచన ఆరుగురు కార్టూనిస్టుల మస్తిష్కంలో మధిస్తే ఎలా ఉంటుంది .



    ఒక ఆలోచన ఆరుగురు కార్టూనిస్టుల మస్తిష్కంలో మధిస్తే  ఎలా ఉంటుంది .  ఒక అద్భుతమైన  కార్టూన్ ఉద్భవిస్తుంది.  
    ఈ ఆలోచనకి భీజం వేసారు గురుదేవులు .

     నేను ఒక రోజు గురుదేవులతో  ఒక పోటి నిమిత్తం  వేస్తున్న కార్టూన్ గురించి ప్రస్థావిస్తూ ..., కంసుడి చెరసాల నుండి కృష్ణుడిని వసుదేవుడు , ఒక బుట్టలో యమునా నది దాటించే సన్నివేశం వివరిస్తున్నాను , ఆ ఆలోచన
గురువుగారికి  నచ్చి  ఈ టాపిక్ పైన మనం కార్టూన్ వేద్దాం ,  వసుదేవుడు కృష్ణుడిని బుట్టలో తీసుకెల్తున్నపుడు
కృష్ణుడి చేతిలో ఏముంటే బాగుంటుందో హాస్యస్పోరకంగా తెలపమన్నారు .

      ఇదే  ప్రశ్న మరో ఐదుగురు కార్టూనిస్టులని  అడిగారు .

     a v m  గారి ఐడియా  ;  రాధ  తన విసిటింగ్ కార్డ్  కృష్ణుడికి అందిస్తుంది .   ఇదొక అద్బుతమైన  ఆలోచన , రాధ                                        ఒక కల్పన, ఆవిడ భాగవతంలో, భారతంలో , ఎక్కడా కనిపించని , కవుల,కావ్యకర్తల                                            సృష్టి ,   ప్రేమదేవత . కృష్ణుడి కన్నా ముందుగానే ఈ సృష్టిలో ఉంది,   గోపికా లోలుడు                                           ముందుగా  ఆమె పొందాలని  విసిటింగ్ కార్డ్ అందిస్తుంది, ఎంత  గొప్ప ఆలోచన .

   బ్నిం  గారి ఐడియా  ;     ఆధార్  కార్డ్  పట్టుకోవడం .    సమయోచితమైన  ఆలోచన  ఇప్పుడు భారత దేశం                                                  మొత్తం ఆధార్ తో అనుసందానించ బడుతోంది ,  ఇది  చూడగానే నవ్వు పుట్టించే                                                  ఆలోచన .

   చక్రవర్తి గారి ఐడియా  ;   కృష్ణుడు  చంపాలనుకుంటున్న    పూతన, శకటాసురుడు, కంసుడు  మొదలగు వారి                                            లిస్టు   పట్టుకుని  ఉంటాడు .  కృష్ణుడి ఉద్దేశాన్ని  తెలిపే  గొప్ప తెలివైన ఆలోచన . 

   సునీల గారి ఐడియా  ;    కృష్ణుడి చేతిలో ఆపిల్ ఐపాడ్ , హెడ్ ఫోన్స్ పెట్టుకుని , గేమ్స్ ఆడుతున్నాడు .                                                    ఇప్పుడు మన ఇళ్ళల్లో చిన్ని కృష్ణులు ఆడే ఆటలన్నీ వీడియొ గేమ్స్ కదా .......,                                                  ఇప్పుడు కృష్ణుడు పుడితే ఆనాడు స్నేహితులతో  చేసిన అల్లరి చేయడేమో  ?    ఎంతటి                                          నిశితమైన పరిశీలనతో కూడిన ఆలోచన .      

సాయి కృష్ణ  గారి ఐడియా  ;   వెన్న దొంగ కృష్ణుడు , వెన్న  దొరక్క  చాకోబార్ తింటున్నాడు ,  మసకబారుతున్న
                                          పల్లె జీవనం ,  నవ్వాలి ఆలోచించాలి .  చాలా చక్కని ఆలోచన .

గురువులు జయదేవుల ఐడియా  ;   ఇదొక గొప్ప సందేశాత్మక , ఆలోచనాత్మక , పరిశీలనాత్మక  ఐడియా.......                                                            భగవత్ గీత  చదువుతున్న కృష్ణుడు .   ఇంతకన్నా సెల్ఫ్ హెల్ప్  సాహిత్యం                                                         ప్రపంచంలో మరెక్కడా లేదు . ఇంతకన్నా పిల్లలకు మార్గ నిర్దేశం చేసే                                                                 ఆలోచన ఏముంటుంది చెప్పండి .
ఈ కార్టూన్లో  బొమ్మలు గురువుగారు వేసినవి, ఆలోచనలు పైన తెలిపిన కార్టూనిస్టులు చేసినవి,  ఇక నా అదృష్టం ఏంటంటే  కేవలం టాపిక్ చెప్పినంత మాత్రాన గురువుగారు నా పేరును ఈ కార్టూన్లో పొందుపరచి , ఇంత గోప్ప కార్టూన్లో నన్ను భాగస్వామిని చేసారు .   గురువుగారికి అనంతకోటి వందనములు .
                                                   గురుభ్యోనమః  గురుభ్యోనమః గురుభ్యోనమః     
                

9, మార్చి 2015, సోమవారం

గురుభ్యోనమః గురుభ్యోనమః గురుభ్యోనమః


   ఫోన్ రింగవుతుంటే తీసి చూస్తును కదా ...... అది గురుదేవులు జయదేవ్ గారినుండి ,  
ఉత్సాహంగా, ఆనందంగా,  ఫోన్ ఎత్తాను .    ఎంతో ఆప్యాయమైన పలకరింపుతో కుశల ప్రశ్నలు అడిగాక ,   నాగ్రాజ్ నువ్వు ఒక ఐడియా చెప్పు నేను బొమ్మ వేస్తాను  అన్నారు ,   ముందుగా నమ్మలేక పోయాను ,  తర్వాత ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను ,   గురువుగారి ఆజ్ఞ , ఆయనంతటి వారికి ఆలోచనలు అందించడమంటే    కాస్త భయం .

   ఇక ఆ రోజంతా ఒకటే మథనం ................... పరిపరి విధాలుగా అలోచనలు ,   ఒక పది ఐడియా లు తట్టి  వాటిలో  నాకు బాగా అనిపించినవి  రెండు గురువుగారి ముందు ఉంచాను , అందులో ఒకటి,     "క్షీర సాగర మథనం    చేస్తుంటే  ఒక గంధర్వుడు ప్రత్యక్షం అయ్యి  దేవా దానవులారా ..... ఇప్పుడు సాగరంలో కలుషితాలు తప్ప అమృతం లేదు .... "    అంటాడు . ఇది ఐడియా గురువుగారు దీని పైన స్పందించి , ఈ ఆలోచనను ఇంకా బాగా సాన పెట్ట మన్నారు ,   మళ్ళి  మథనం .............  మరుసటి రోజు గురువుగారికి ఫోన్ చేసి ,   "దేవ దానవులు  సాగర మథనం చేస్తుంటే చెత్త చెదారం , సముద్రంలో కూలిన ఓడలు , లక్ష్మి, గాయత్రి  పైకి లేస్తాయి ..... "  

   ఈ ఐడియా నేను చెబుతుండగానే .........  గురువుగారు  ఒక్క క్షణం ఆగి  నాగ్రాజ్  అవన్నీ కాదు , మొన్న కూలిన మలేషియా  విమానం  పైకి లేస్తే ఎలాఉంటుంది ...... ?    అన్నారు .       ఇక నేను లాక్ .     that is jayadev  సార్ .

  ఎంత గొప్ప నిశితమైన పరిశీలన ఉంటె   అంత అద్బుతంగా ఆలోచించగలరు ,  అందుకే తెలుగు కార్టూనిస్ట్ లందరికి  ఆయన గురువు, దైవం, ఆరాద్యులు , జయదేవులు .

  ఈ కార్టూన్లో సాగర మథనం వరకే నా ఆలోచన,  మిగతా అంత గురువుగారే, ఆయన బొమ్మలో ,  విమానం బొమ్మ నా చేత వేయించడమే  కాకుండా,   నా పేరు కూడా పొందు పరిచి నాకో గుర్తింపు నిచ్చారు.    ఇది ఆయన గొప్ప మనసుకి నిదర్శనం .   ఇంతటి గొప్ప గురువు దొరకడం  నేను పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం .

                                      గురుభ్యోనమః  గురుభ్యోనమః     గురుభ్యోనమః