గ్లోబలైజేసన్ ..... అక్టోబర్ 2014 హాస్యానందం మాస పత్రిక లో బెస్ట్ కార్టూన్ అఫ్ ది మంత్ గా ఎంపికైన నా కార్టూన్ . బహుమతి ప్రదాత శ్రీ సత్యనారాయణ గారికి , నా కార్టూన్ని బహుమతికి ఎంపిక చేసిన పత్రిక ఎడిటర్ శ్రీ రాము గారికి నా హ్రిదయపూర్వక ధన్యవాదములు ... రాముగారు గత మూడు సంవత్సరాలుగా నా కార్టూన్లను హాస్యానందం మాస పత్రికలో ప్రచురిస్తూ నన్ను ఎంతో ప్రోత్సహించడమే కాకుండా ...., నేను కోరగానే ,వెర్రి నాగన్న ఫీచర్ కార్టూన్స్ వేయడానికి అనుమతించారు. నాకంటూ కార్టూనిస్టుగా ఒక ఇమేజ్ ఏర్పడింది అంటే దానికి నిస్సందేహంగా హాస్యానందం రాముగారి ప్రోత్సాహం ఎంతో ఉందని మనస్పూర్తిగా చెప్పగలను. ఒక నన్నుమాత్రమే కాదు, తెలుగుకార్తూనిస్ట్ లందరినీ తన బుజాల పైన మోయడానికి ,ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హాస్యానందం పత్రికను నడుపుతున్నారు ది గ్రేట్ రాముగారు, హాట్సాఫ్ రాము సర్, మీకు రుణపడి ఉంటాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి