29, డిసెంబర్ 2014, సోమవారం

నాలోన గలశివుడు నీలోన గలశివుడు నాటకాలాడగలడు


       

       
          ఎన్నో రోజులుగా మా ఆవిడ కోరుతున్న కోరిక , ఒక్క సారి వేములవాడ దేవస్థానం వెల్లివద్దమండి , చాలా రోజుల క్రితం ఏదో మొక్కుకుందట , అది తీర్చాలట , ఆవిడకి దేవుడిపైన చాలా నమ్మకం , నమ్మకమే కదండీ మనిషిని ముందుకి నడిపిస్తుంది , ప్రతివ్యక్తికి ఏదో ఒక దానిపైన నమ్మకం ఉంటుంది, అది దేవుడా,తాను చేస్తున్న పనా , తన పైన తనకా  ఏదైనా కానియండి , నమ్మకం మాత్రం నిజం . అదే ఈ  సృష్టికి ఆధారం .

        ఇదంతా సోది ఎందుకుగాని అసలువిశయానికి వద్దాం , అది కార్తీక మాసం కావడంచేత శివాలయాలలో విపరీతమైన రద్దీ ఉంటుంది  అంచేత సూర్యోదయానికి ముందే వేములవాడ చేరుకునేలా ప్రయాణమై వెళ్ళాం .

        బస్సుప్రయానం , అక్కడికి చేరుకునే సరికి ఉదయం ఎనిమిది దాటింది , దిగంగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా , ఆలయం పడమటి ద్వారం గుండా దేవస్థానం లోకి ప్రవేశించాం , ప్రవేశిస్తూనే దేవస్థానం వారు ఏర్పాటుచేసిన మైకుల్లో తనికెళ్ళ భరణి గారు రచించి గానం చేసిన శివతత్వాలు వినిపిస్తున్నాయ్ , ఆవెంటనే ఆలయానికి సంబందించిన సూచనలు చేస్తున్నారు.

       ఆలయానికి కుడివైపున ఉన్న " ధర్మగుండం "  {కోనేరు } లో స్నానం చేయడానికి ఉపక్రమించాం , అదే వైపున పెద్ద చెరువు, చాల శుద్దిగా ఉంది నీరు దాంట్లో బోటింగ్ కూడా ఏర్పాటు చేసారు, మైకులో ....... నాలోన గలడు శివుడు నీలోన గలడు శివుడు ..... నాలోన గలశివుడు నీలోన గలశివుడు గంగ తలకేత్తగలడు ................

      భక్తులకు విజ్ఞప్తి ధర్మగుండంలో కొబ్బరికాయలు కొట్టకూడదు , రూపాయి నాణాలు వేయకూడదు , సబ్బులు వాడకూడదు , ఆలయ పారిశుద్యానికి సహకరించండి,    అనౌన్సు మెంటు  వినిపిస్తోంది , నిజమే కదండీ , మనం విచక్షణతో ఉండకపోతే  పారిశుద్యం ఎలా సాధ్యం , అసలు ఇలాంటివన్నీ ఒకరు సూచిస్తేనే మనం చెయాల , పౌరులుగా  పారిశుద్యం పాటించడం మన భాధ్యత కాదా? పోనిలెండి , వారుసూచించిన విధంగా  మేము మా స్నానాలు ముగించుకుని , తడిగుడ్డలతో దర్శనం కోసం లైన్ లో నిలబడటానికి పరుగులు తీస్తున్నాం , రద్దీ చాలా ఎక్కువగా ఉంది , దర్మగుండానికి ఆనుకుని కల్యాణకట్ట , దాన్ని ఆనుకుని కళ్యాణమండపం , దానికి ఎదురుగా బెల్లం అమ్మకాలు సాగుతున్నాయి , కోరికలు తీరిన భక్తులు మొక్కిన మొక్కుబడిని బట్టి బెల్లం తూకం వేయించి ప్రసాదంగా పంచుతుంటారు, బెల్లం పంచుతున్న వారిని తదేకంగా చూస్తున్న నన్ను  'ఎంటండి మీరు దిక్కులు చూస్తూ నిలబడ్డారు , త్వరగా నడవండి ప్రత్యేక దర్శనం టిక్కెట్ తీసుకురండి , ధర్మదర్శనం లైన్ లో నిలబడ్డ మంటే   ఇక ఇంత రద్దీ లో మన దర్శనం ఇవాళ ఐనట్టే , ఊ  త్వరగా నడవండి ...... నన్ను తొందర చేసింది నా శ్రీమతి .

       భక్తుల సౌకర్యమ్ కోసం మూడు క్యూ  లైన్ లు ఏర్పాటుచేశారు . ధర్మదర్శనం , ప్రత్యేక దర్శనం , కోడె మోక్కుల దర్శనం ,  ఈ మూడు వరసలు సమాంతరంగా వెళ్తూ ఆలయ గాలిగోపురం దగ్గర కలుస్తాయి ,
ఇక్కడ కోడె మోక్కులు ప్రత్యేకం, తమకోర్కెలు తీరితే కోడె ను{ఎద్దు } కట్టేస్తాం అని మొక్కుకున్న భక్తులు
ఆలయం వారు ఏర్పాటు చేసిన కోడెలను తీసుకుని గర్బగుడి చుట్టూ ప్రదక్షినగా తీసుకువచ్చి , గర్బ గుడికి ఎదురుగా కట్టేస్తారు, దీనికి గాను కొంత రుసుం కట్టాల్సి ఉంటుంది, ఇది వేములవాడ రాజరాజేశ్వరస్వామికి ప్రత్యేకం.

        రెండు ప్రత్యేక దర్శనం టిక్కెట్ లు తీసుకుని శ్రీమతి నేను వరసలోకి ప్రవేశించాం , హరహర మహాదేవ ..... హరహర మహాదేవ ................ భక్తుల హర్శద్వానాలతో వరసలన్ని హోరెత్తి పోతున్నాయి , హమ్మయ్య లైన్లో నిలబడేదాకా మనసు కుదుట పడలేదు , వరసలన్ని భక్తులతో కిట కిట లాడుతున్నై , మా పక్క వరస కాళిగా ఉంది , అది ధర్మ దర్శనం లైన్ ,  ప్రతి ఒక్కరు తొందరగా దర్శనం చేసుకుందాం అనే తొందరలో డబ్బులు కట్టి లైన్లో  నిలబడ్డవారే , దాంతో ధర్మదర్శనం లైనంతా ఖాళీగా ఉంది ,  మాయావిడకి చూపించాను  అయ్యో ముందే అనుకుంటే ఆ లైన్లోనే వెళ్ళేవాళ్ళం కదండీ అంది నాలిక్కరుచుకుంటూ ...................,

        మైకులో భరణిగారి శివతత్వాలు వినిపిస్తున్నాయ్ ......... నాలోన శివుడు గలడు ........ నీలోన శివుడు గలడు ..................  నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపైనున్డగలడు  .................. ,     భక్తులకు విజ్ఞప్తి , క్యు లైన్లో ఉన్న వారు సంయమనం పాటించగలరు , తోపులాటలు వద్దు , రద్దీ ఎక్కువగా ఉంది గమనించ ప్రార్థన,
మా పక్క వరసలో ఒక జంట చిన్న పాపను ఎత్తుకుని నించున్నారు , మూడు సంవత్సరాలు వరకు ఉంటాయ్ పాపకు, ఒకటే ఏడుపు , పుట్టు వెంట్రుకలు తీయించి నట్లున్నారు , కోడె మోక్కుల లైన్లో నించున్నారు , పాప ఏడుపు వాళ్లకు ఎం తోచకుండా ఉంది , లైనువిదిచిపొరాదు ,కొత్త గుండుతో ఉన్న పాప ఏడుపు ఆపదు , ఎంత ఊరడించినా వినడంలేదు , వారినిచూసి మాయావిడ విలవిల్లాడి పోయింది , కొంచెంసేపు పాపను తీసుకుని ఆడించినా ఫలితంలేదు .  పాపతండ్రి చిరాకు పడిపోతున్నాడు,  అటు ఇటు గా  గాలిగోపురం దగ్గరిదాకా వచ్చాం , ఇక్కడి నుండి అన్ని లైన్లో వాళ్ళు ఏకమై గర్బగుడి ద్వారంలోకి ప్రవేశిస్తారు .

        ఆలయ గోపురం దాటగానే గర్భగుడికి ఎడమవైపున , హజ్రత్ బాబా సమాది  ద్వజ స్థంబం పక్కనే ఊదు  పొగ పట్టించుకుంటూ , తావీజులు కట్టించు కుంటున్న భక్తులు .......................,  హజ్రత్ బాబా గొప్ప శివ భక్తుదంట , ఆయన జ్ఞాపకార్థం  సమాదిని గర్భగుడి ముందరే ఏర్పాటు చేసారు . ఎంత గొప్ప మత సామరస్యం మనది , జైహో భారత్ .

       దర్శనం త్వరగా అవుతుందిరా మహాదేవా అనుకుంటూనే ఉన్నాం గాని , గంట సేపు , రెండు గంటల సేపు , లైను కదలదె , ఎక్కడివారం అక్కడే ఆగిపోయాం, లైను ఒక్క ఇంచుకూడా కదలడం లేదు . ఏమై ఉంటుందా ............ ,   పక్క లైన్లో పాప ఏడుపు ఆపడంలేదు, లైను కదలడంలేదు , గంటలకొద్దీ నిలబడి కాళ్ళు లాగుతున్నాయ్ , ఓపిక నశిస్తోంది , ఏడుస్తున్న పాప తండ్రికి ఓపిక నశిన్చిందేమో , అక్కడ కాపలాగున్న కానిస్టే బుల్  ని పిలిచి విషయం ఆరా తీసాడు, ఆలయ e.o. ప్రత్యేక పూజలు చేయిస్తున్నదంట , అందుకే ఈ ఆలస్యం .

       "ఏమైనా అంటే అన్నమంటారుగాని  భక్తుల సౌకర్యాలు చూడాల్సిన e.o. గారే భక్తుల అసౌకర్యానికి  కారణమైతే  ఎంటండి దానర్థం , బుద్ది జ్ఞానం ఉండక్కర్లేదా ....... అసలు వాడు మనిషేనా .......... @@@@@@ $$$$$$$ %%%%%%% ######### &&&&&&&  మాటల్లో చేపడానికి వీలుకావడం లేదు అందుకే పై గుర్తులు వాడాను , అంత విపరీతంగా తిట్టాడండి  ఆపాప తండ్రి . తన ఆవేదనంత ఆ తిట్లల్లో వెళ్ళగక్కాడు,  అంతలో అటుగా ఆలయ ప్రదక్షణ చేస్తూ  వస్తున్న e.o. ఈ గొడవ వింటూ అక్కడ ఆగాడు, కాపలాగున్న కానిస్టేబుల్ ని పిలుచుకుని విషయం ఆరాతీస్తున్నాడు ..................... మైకులో .................. నాలోన శివుడు గలడు  ...........................నీలోన శివుడు గలడు ....................నాలోన గల శివుడు నీలోన గలశివుడు   ఒక కంట చూడగలడు .......................  భక్తుల అసౌకర్యానికి చింతిస్తున్నాం ................................................ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, !!!!!

          మెల్లగా క్యు లైను కదలడం మొదలైంది , ధర్మదర్శనం లైను, ప్రత్యేక దర్శనం లైను రెండు లోపలి వదిలాడు కానిస్టేబుల్ , కోడె మొక్కుల లైను ఆపేసాడు, మేము లోపలి కదులుతున్నాం , ఆ పాప ఏడుపు రెట్టింపు చేసింది , ఆ పాప తండ్రి  కళ్ళల్లో రక్తాలు కనిపిస్తున్నాయ్ , e.o. కి కానిస్టేబుల్ కి మద్య ఏదో సంబాషణ జరిగింది , దాని పర్యావసానమే  కోడె మొక్కుల క్యు లైను ఆగిపోవడం ,    మైకులో ............................................   నాలోన శివుడు గలడు  ..............................  నీలోన శివుడు గలడు ....................  నాలోన గలశివుడు  నీలోన గలశివుడు   నాటకాలాడగలడు ...................................

      పాప ఏడుపు నాకు ఇంకా విన బడుతూనే ఉంది ..................................., ఆ సంగటన నన్ను  లోపలినుండి కేలుకుతూనే ఉంది .....................


గాంధి గారి మార్గం



27, డిసెంబర్ 2014, శనివారం

ఇవి 2014 సంవత్సరంలో బహుమతులు పొందిన నా కార్టూన్లు





ఇవి  2014 సంవత్సరంలో బహుమతులు పొందిన నా కార్టూన్లు , వీటితో పాటు మరికొన్ని కార్టూన్లు ప్రముఖుల ప్రశంశలు, కార్టూన్ ఇష్టుల అభిమానం చూరగోన్నవి కూడా ఉన్నాయి, మొత్తానికి 2014 సంవత్సరం నాకు విజయాలను, విమర్శలను, ఆనందాన్ని , ఆలోచనలను, అనుభవాలను, గురుదేవుల ఆశీర్వాదాన్ని, మిత్రుల ప్రోత్సాహాన్ని, కొంత గందరగోలాన్ని  మిగిల్చింది .  శుభం భూయాత్ ! 



23, డిసెంబర్ 2014, మంగళవారం

పారిశ్రామికీకరణ



నగరం నాగరికునికి  కాలుష్యాన్ని  అలవాటు చేసింది,  మనిషిని  సహజత్వానికి, ప్రకృతికి దూరం  చేసింది, పారిశ్రామికీకరణ మత్తులో మనిషి మునిగిపోయాడు, ఇప్పుడు పరిశ్రమలనుండి వెలువడిందే స్వచ్చం , శ్రేష్టం, ఆరోగ్యకరంగా గుర్తింపబడుతోంది . 

14, డిసెంబర్ 2014, ఆదివారం

courtesy; www.teluguvennela.com సదాశివ్ తన తండ్రిగారి పిండప్రదానం ,పూజాది కార్యక్రమాలు నిర్వహించి పక్షికోసం ఎదురు చూస్తున్నాడు ............., కుటుంబ సబ్యులంత నది గట్టున ఒక వైపున పిండం వదిలి మరోవైపున నిలబడ్డారు , నదిగట్టున కొంతదూరం వరకు ఒక్క చేట్టుకూడా లేదు ఎక్కడో దూరాన ఒక్క తుమ్మ చెట్టు తప్ప . సూరీడు తూరుపు వదిలి నడి నెత్తిన నిలబడ్డాడు , అందరి తలలు మాడుతున్నాయ్ , కాళ్ళు లాగుతున్నాయ్ , కడుపులు చుర చుర లాడుతున్నాయ్ , ఒక్క పక్షి రాలేదు , పిండం ముట్టలేదు, సదాశివ్ తో సహా కుటుంబ సభ్యులన్దరిలో ఆందోళన మొదలైంది , ఎం చేయాలో తోచడం లేదు , అందరు ఒక్కొక్కరుగా వచ్చి పిండపదార్థం ముందు నిలబడి తప్పులుంటే క్షమించమని , ఏదైనా తక్కువ చేసామాని , ఇంకెవరైనా రావాలా ని , అలకవీడి పిండం ముట్టమని , వేడుకోవడం మొదలుపెట్టారు, సదాశివ్ భార్య ఒక్కసారిగా ఏడుపు అందుకుంది, మా తప్పులేవైన ఉంటె పెద్దమనసుతో క్షమించమని , మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని పూజిస్తామని వేడుకుంది . ఇదంతా దూరాన ఉన్న తుమ్మచెట్టు పైన వాలిన కాకుల జంట గమనిస్తుంది , చూసావా బావా ఈ మాత్రం ఎండా , ఆకలిబాధకే ఎంత విలవిల్లడిపోతున్నారో ............, చనిపోయిన పెద్దాయన నాకు తెలుసులేవే , ఆయన ఉండే వ్రిద్దాశ్రమమ్ లో ఒక చెట్టుపైన నేను కొన్నాళ్ళు కాపరం ఉన్నాను . ఆ చెట్టు క్రింద స్నేహితులతో కూర్చుని , అమెరికాలో కొడుకు, ఇక్కడేమోతను , ఎవరులేనివాడిలాగా ఎంతవేదనపడేవాడో , ఎన్ని నిద్రలేనిరాత్రులు గడిపాడో, ఎన్ని రోజులు తిండి తినకుండా బాధపడ్డాడో , బ్రతికుండగా ఒక్కనాడన్నా కొడుకు చూడడానికి వచ్చిన పాపాన పోలేదు , ఫోనులో నైన పలకరించిన వాడుకాదు , ఇప్పుడేమో గుండెల్లో పెట్టుకు పూజిస్తడట్ట, ఛి ఛి !!! ఇలాంటి వాడు పెట్టిన పిండం ముడితే మనకు పాపం చుట్టుకుంటుంది , పదవె పోదాం ఈ మాత్రమైన వాడు బాధ పడకపోతే ఆ ముసలాయన ఆత్మకి శాంతి ఉండదు . ఆత్మ రూపంలో కాకులజంట పక్కనే కూర్చుని ఉన్న సదాశివ్ తండ్రి వాటి సంభాషనంత వింటున్నాడు , కాకుల ఆలోచన ఈ రకంగా ఉంటె ఆత్మ రూపంలో ఉన్న పెద్దాయన ఆలోచన మరోరకంగా ఉంది , ఎంత చెడ్డ................, వాడు నా కొడుకు , ఎ పరిస్థితులలో వాడు నన్ను వ్రిద్ధశ్రమం లో ఉంచాల్సి వచ్చిందో , అమెరికాలో వాడికే తీరిక ఉండదు , కోడలు కూడా ఉద్యోగినే కదా , వారిరువురు వాళ్ళ పనుల్లో మునిగిపోతే ఇక నన్ను చూసుకునేది ఎవరు , అందుకే విధి లేక నన్ను వ్రిద్దశ్రమంలో చేర్పించాడు, అది తెలుసుకోలేక నేనే అనవసరంగా బాధ పడ్డాను , అయినా వాడు అమెరికాలో ఉద్యోగం చేయాలి , గొప్పవాడు కావాలి అని కలలు గని చదివించింది నేను కాదా ? ఇల్లు కుదవ పెట్టి ఇంజనీరింగ్ చదివించింది నేను కాదా ......, అమెరికాలో ఉద్యోగం దొరికితే , కనిపించిన వారికల్ల చెప్పుకుని ఆనందపడింది నేను కాదా ? మరి వాడి తప్పు ఏమిటి , ఇప్పుడుకూడా వాడు బాధ పడకూడదు , అనుకుంటుండగా ................ ఇందాక చీదరించుకున్న కాకము తిరిగి వెళ్ళిపోతుంది ............ మరో కాకము చేట్టుపైనే ఉంది ఎగిరిపోతున్న కాకి సర్రున తిరిగి వెళ్ళి పిందపదార్థము పైన వాలింది ......................... చెట్టు పైన కూర్చున్న కాకి తలపంకించి ఆశ్చర్యంతో పిండంపైన వాలిన కాకినే చూస్తుండి పోయింది ................... కాకిలో దూరిన సదాశివ్ తండ్రిగారి ఆత్మ కడుపారా పిండ పదార్థాన్ని ఆరగించి, కొడుకుని మనసారా ఆశీర్వదించింది .

                       

                    

13, డిసెంబర్ 2014, శనివారం

ఓదార్చే బాధ్యత నీదే .


            విరహంతో తడిపి 
            పోస్ట్ చేసిన నీ మనసుని చదివాను 
            అక్షరాలనిండా నువ్వే 

             నిన్ను చూసి 
             నీరై కారుతున్న 
             నా మనసుని  బదులు 
             పంపుతున్నాను 

             ఓదార్చే బాధ్యత  నీదే . 

వరకట్నం



12, డిసెంబర్ 2014, శుక్రవారం

1, డిసెంబర్ 2014, సోమవారం

అంతర్జాల పత్రికల్లో ప్రచురితం అయిన నా మొట్టమొదటి కార్టూన్ ఇది


     ఇప్పటివరకు నేను కార్టూన్ కథ వ్రాయలేదు  కాని కార్టూన్ స్ట్రిప్ వేసాను ,  ఇది నవంబర్ , 2011 ,   www.64kalalu.com , వెబ్ మాగజిన్ లో ప్రచురితం అయింది .
 
     అంతర్జాల పత్రికల్లో ప్రచురితం అయిన నా మొట్టమొదటి కార్టూన్ ఇది ,  అడపా దడపా కార్టూన్లు వేసే నన్ను వెన్నుతట్టి , రెగ్యులర్ గా కార్టూన్లు వేయమని, 64కళలు . కొం .  మాసపత్రికకి కార్టూన్లు పంపితే తప్పకుండా ప్రచురిస్తానని , ఎంతగానో ప్రోత్సాహాన్ని అందించిన కళాసాగర్. యెల్లపు గారికి ధన్యవాదములు,  ఆయన ప్రోత్సాహం మరువలేనిది . ఒక శుభోదయాన ఆయన కార్టూన్ల పుస్తకం నాకు బహుమతిగా అందించారు , ఆ రోజును నేను ఎప్పటికి మరువలేను,  నేను ఎంతో ఆనందించిన రోజు అది . థాంక్యు  కళాసాగర్ సర్ ...... థాంక్యు వేరి మచ్ .