14, డిసెంబర్ 2014, ఆదివారం

courtesy; www.teluguvennela.com సదాశివ్ తన తండ్రిగారి పిండప్రదానం ,పూజాది కార్యక్రమాలు నిర్వహించి పక్షికోసం ఎదురు చూస్తున్నాడు ............., కుటుంబ సబ్యులంత నది గట్టున ఒక వైపున పిండం వదిలి మరోవైపున నిలబడ్డారు , నదిగట్టున కొంతదూరం వరకు ఒక్క చేట్టుకూడా లేదు ఎక్కడో దూరాన ఒక్క తుమ్మ చెట్టు తప్ప . సూరీడు తూరుపు వదిలి నడి నెత్తిన నిలబడ్డాడు , అందరి తలలు మాడుతున్నాయ్ , కాళ్ళు లాగుతున్నాయ్ , కడుపులు చుర చుర లాడుతున్నాయ్ , ఒక్క పక్షి రాలేదు , పిండం ముట్టలేదు, సదాశివ్ తో సహా కుటుంబ సభ్యులన్దరిలో ఆందోళన మొదలైంది , ఎం చేయాలో తోచడం లేదు , అందరు ఒక్కొక్కరుగా వచ్చి పిండపదార్థం ముందు నిలబడి తప్పులుంటే క్షమించమని , ఏదైనా తక్కువ చేసామాని , ఇంకెవరైనా రావాలా ని , అలకవీడి పిండం ముట్టమని , వేడుకోవడం మొదలుపెట్టారు, సదాశివ్ భార్య ఒక్కసారిగా ఏడుపు అందుకుంది, మా తప్పులేవైన ఉంటె పెద్దమనసుతో క్షమించమని , మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని పూజిస్తామని వేడుకుంది . ఇదంతా దూరాన ఉన్న తుమ్మచెట్టు పైన వాలిన కాకుల జంట గమనిస్తుంది , చూసావా బావా ఈ మాత్రం ఎండా , ఆకలిబాధకే ఎంత విలవిల్లడిపోతున్నారో ............, చనిపోయిన పెద్దాయన నాకు తెలుసులేవే , ఆయన ఉండే వ్రిద్దాశ్రమమ్ లో ఒక చెట్టుపైన నేను కొన్నాళ్ళు కాపరం ఉన్నాను . ఆ చెట్టు క్రింద స్నేహితులతో కూర్చుని , అమెరికాలో కొడుకు, ఇక్కడేమోతను , ఎవరులేనివాడిలాగా ఎంతవేదనపడేవాడో , ఎన్ని నిద్రలేనిరాత్రులు గడిపాడో, ఎన్ని రోజులు తిండి తినకుండా బాధపడ్డాడో , బ్రతికుండగా ఒక్కనాడన్నా కొడుకు చూడడానికి వచ్చిన పాపాన పోలేదు , ఫోనులో నైన పలకరించిన వాడుకాదు , ఇప్పుడేమో గుండెల్లో పెట్టుకు పూజిస్తడట్ట, ఛి ఛి !!! ఇలాంటి వాడు పెట్టిన పిండం ముడితే మనకు పాపం చుట్టుకుంటుంది , పదవె పోదాం ఈ మాత్రమైన వాడు బాధ పడకపోతే ఆ ముసలాయన ఆత్మకి శాంతి ఉండదు . ఆత్మ రూపంలో కాకులజంట పక్కనే కూర్చుని ఉన్న సదాశివ్ తండ్రి వాటి సంభాషనంత వింటున్నాడు , కాకుల ఆలోచన ఈ రకంగా ఉంటె ఆత్మ రూపంలో ఉన్న పెద్దాయన ఆలోచన మరోరకంగా ఉంది , ఎంత చెడ్డ................, వాడు నా కొడుకు , ఎ పరిస్థితులలో వాడు నన్ను వ్రిద్ధశ్రమం లో ఉంచాల్సి వచ్చిందో , అమెరికాలో వాడికే తీరిక ఉండదు , కోడలు కూడా ఉద్యోగినే కదా , వారిరువురు వాళ్ళ పనుల్లో మునిగిపోతే ఇక నన్ను చూసుకునేది ఎవరు , అందుకే విధి లేక నన్ను వ్రిద్దశ్రమంలో చేర్పించాడు, అది తెలుసుకోలేక నేనే అనవసరంగా బాధ పడ్డాను , అయినా వాడు అమెరికాలో ఉద్యోగం చేయాలి , గొప్పవాడు కావాలి అని కలలు గని చదివించింది నేను కాదా ? ఇల్లు కుదవ పెట్టి ఇంజనీరింగ్ చదివించింది నేను కాదా ......, అమెరికాలో ఉద్యోగం దొరికితే , కనిపించిన వారికల్ల చెప్పుకుని ఆనందపడింది నేను కాదా ? మరి వాడి తప్పు ఏమిటి , ఇప్పుడుకూడా వాడు బాధ పడకూడదు , అనుకుంటుండగా ................ ఇందాక చీదరించుకున్న కాకము తిరిగి వెళ్ళిపోతుంది ............ మరో కాకము చేట్టుపైనే ఉంది ఎగిరిపోతున్న కాకి సర్రున తిరిగి వెళ్ళి పిందపదార్థము పైన వాలింది ......................... చెట్టు పైన కూర్చున్న కాకి తలపంకించి ఆశ్చర్యంతో పిండంపైన వాలిన కాకినే చూస్తుండి పోయింది ................... కాకిలో దూరిన సదాశివ్ తండ్రిగారి ఆత్మ కడుపారా పిండ పదార్థాన్ని ఆరగించి, కొడుకుని మనసారా ఆశీర్వదించింది .

                       

                    

కామెంట్‌లు లేవు: