25, అక్టోబర్ 2014, శనివారం

" యండమూరి వీరేంద్రనాథ్ గారి పుస్తకంలో నా కార్టూన్ "



       
 " యండమూరి వీరేంద్రనాథ్ గారి పుస్తకంలో నా కార్టూన్ "
        నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను ,  తెలుగుపాటకలోకాన్ని ఉర్రుతలూపే ..... అద్బుతమైన చిరస్థాయిగా నిలచిపోయే ఎన్నో గొప్ప రచనలు చేసిన చేస్తున్న , గొప్ప రచయిత .  హాస్యానందం మాస పత్రికలో ప్రచురితం ఐన నా కార్టూన్లలో ఒకటి  ఎంపిక చేసుకుని   "లోయనించి శిఖరానికి " పుస్తకంలో ప్రచురించారు , ఇది నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను . హాస్యానందం పత్రిక సంపాదకులు రాము గారికి , ది గ్రేట్  యండమూరి వీరేంద్ర నాథ్  గారికి  హ్రిదయపూర్వక శతకోటి ధన్యవాదములు  

20, అక్టోబర్ 2014, సోమవారం

బహుమతి పొందిన నా మరో కార్టూన్

హాస్యానందం మాస పత్రిక   నిర్వహించిన quitefun  కాప్షన్ లెస్ compition లో 3rd ప్రైజ్ పొందిన ఈ కార్టూన్ ప్రక్యాత చిత్రకారిణి సువర్ణ భార్గవి గారి కార్టూన్ 1980 లో వేసిన దాన్ని పోలిఉండడం వివాదానికి దారితీసింది ..... ఇది కాపీ అని కొందరు ,కాదు ఒకేరకం ఆలోచనలు , ఒకేరకమైన సబ్జెక్టు తీసుకుంటే కలవడం సహజమని మరికొందరు మిత్రులు , మద్దతు పలకడం , ఇదివరకు ఇలాగే ఎంతోమంది కార్టూనిస్టుల కార్టూన్లు ఒకేరకంగా రావడం జరిగిందని ...... చర్చను ముగించడం జరిగిన్ది. 

5, అక్టోబర్ 2014, ఆదివారం

DUSTBIN , ADICTED

                                              
                           


                                                                                                                                                            5thఅక్టోబర్ 2014, వార్త డైలీ లో ప్రచురింపబడిన  కార్టూన్స్ , మొదటిది నాగరికంగా అత్యంత ఆధునికతను సంతరించుకున్న మానవుడు ,అనాగరికంగా వ్యవహరిస్తూ , అనాలోచితంగా పాలితిన్ వాడకాన్ని విస్తృతంగా పెంచుకుంటూ ......... భూమండలాన్ని ఒక చెత్త బుట్టలా మార్చేస్తున్నాడు . పర్యావరణానికి ఎంతోహాని కలగాజేస్తున్నాడు.                                                                                                                                                           రెండవది , ఒక సామాజిక మాధ్యమానికి బానిసై దాని వెంట తోక ఊపుతూ తిరుగుతున్నాడు.  

GLOBALIZATION

                                                                                                                                                                               గ్లోబలైజేసన్  ..... అక్టోబర్ 2014 హాస్యానందం మాస పత్రిక లో బెస్ట్ కార్టూన్ అఫ్ ది మంత్ గా ఎంపికైన నా కార్టూన్ .  బహుమతి ప్రదాత శ్రీ సత్యనారాయణ గారికి , నా కార్టూన్ని బహుమతికి ఎంపిక చేసిన పత్రిక ఎడిటర్ శ్రీ రాము గారికి నా హ్రిదయపూర్వక ధన్యవాదములు ... రాముగారు గత మూడు సంవత్సరాలుగా నా కార్టూన్లను హాస్యానందం మాస పత్రికలో ప్రచురిస్తూ నన్ను ఎంతో ప్రోత్సహించడమే కాకుండా ...., నేను కోరగానే ,వెర్రి నాగన్న ఫీచర్ కార్టూన్స్ వేయడానికి  అనుమతించారు. నాకంటూ కార్టూనిస్టుగా ఒక ఇమేజ్ ఏర్పడింది అంటే దానికి నిస్సందేహంగా హాస్యానందం రాముగారి ప్రోత్సాహం ఎంతో ఉందని మనస్పూర్తిగా  చెప్పగలను. ఒక నన్నుమాత్రమే కాదు, తెలుగుకార్తూనిస్ట్ లందరినీ తన బుజాల పైన మోయడానికి ,ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హాస్యానందం పత్రికను నడుపుతున్నారు  ది గ్రేట్ రాముగారు, హాట్సాఫ్ రాము సర్, మీకు  రుణపడి ఉంటాను.                      

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

poor people became poor.

ఈనాడు మన దేశ  ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందంటే ........ శ్రమించే వాడు ఒకడైతే ఆ శ్రమ ఫలితాలు  అనుభవించే వాడు  వేరొకడు ఈ అంశం ఆదరంగా నేను వేసినా ఈ కార్టూన్  చూడండి , మహావృక్షం లాంటి మన దేశం ఒక ఆర్ధిక శక్తి అయితే , దాని ఆర్థిక ప్రగతికోసం రెక్కలు ముక్కలు చేసుకుని సరైన కనీస సౌకర్యాలు లేక [కూడు,గుడ్డ,గోదు.], కస్టపడి పనిచేసే బీద వాడు ప్రగతి ఫలితాలు పొందలేని పరిస్థితి .  ఈ దుస్థితికి కారణం  ఎవరు , మనము కాదా ? అధికారులు,నాయకుల పట్ల మన అలసత్వము కాదా ? 

13, సెప్టెంబర్ 2014, శనివారం

save telugu


      మొదట ఈ కార్టూన్  కరీంనగర్ లో జరిగిన ప్రదర్శన నిమిత్తం పంపడం  జరిగిన్ది.......   బొమ్మను ఒక సారి చూడండి .... అక్కడ బోర్డు పైన తెలుగు భాషను రక్షించండి ,  అని ఉన్న మాటలు ఆవిడ అనుకుంటున్నట్లు వ్రాసాను.... అంటే బోర్డు  లేదు ...  కార్టూన్ బాగోలేదని ....., అర్థం పర్థం లేదని అందరు విమర్శించారు.........

      ఈ కార్టూన్ ని ఎంతో ఇష్టపడ్డ నేను ..  వృధా కావద్దని , ఈ కార్టూన్ గూర్చి గురుదేవులు జయదేవ్ సర్ దగ్గర   ప్రస్తావించాను , ఆయన ఎంతో ఓపికగా  ఫోన్ లో  నేను చెప్పినదంతా విని...... తడుముకోకుండా వెంటనే ఒక మార్పు సూచించారు ...... అమ్మాయి వెనకాల బోర్డు పెట్టి ''తెలుగుభాషని రక్షిద్దాం''  అని వ్రాయమన్నారు.            
       మార్పులు చేసి ఆంధ్రప్రదేశ్ మాస పత్రికకి పంపడం అది ప్రచురణకు నోచుకోవడం ......, నేను తెలుగుకార్టూనిస్టులు  ఫేస్బుక్  గ్రూప్ లో పోస్ట్ చేయడం , అది ఎన్నో ప్రశంశలకు  నోచుకోవడం, నాకు ఎంతో
గుర్తింపు రావడం  జరిగింది .

   
       ఈ కార్టూన్ కి ఎంత గుర్తింపు వచిందో , దాని క్రెడిట్ అంత గురువుగాకే చెన్దుథున్ది...... గురుబ్యోనమః
ఈ రోజు గురువుగారి పుట్టిన రోజు ...... ఆయన ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని ఆ శివుడిని ప్రార్థిస్తున్నాను ...... 


6, సెప్టెంబర్ 2014, శనివారం

 వాన                                                               



సవ్వడి లేని సాయంత్రాన 
నాకు నువ్వు నీకు  నేను 
ఉరుకు పరుగున వచ్చే కారు మబ్బులు 
నిశబ్దాన్ని చేదించాయి 

విరహాన్ని ఓపని వాన దేవుడు 
నింగి వీడి నేల చేరాడు 

నీకురుల్లో చిక్కి ఒక్కోచినుకు 
చెక్కిలినిఆని గుండెల్లో పడుతుంటే 
 చలికి  వణికే  నిన్నుచూసి 
వాన జోరు  తగ్గింది 
ఇన్ధ్రధనస్సయ్ నీకు జోహారంది 

నీటి ముద్దవైన నీ మోము పై 
ముత్యమై మెరిసే వాన చినుకు 
నన్ను నీ దాసుణ్ణి చేసింది ..........