పత్రికల్లో అచ్చైన నా మొట్ట మొదటి కార్టూన్ ఇది .
1998 లో నేను డిగ్రీ చదివే రోజుల్లో నా ప్రియ మిత్రుడు ప్రభాకర్ రెడ్డి యేలేటి ఈనాడు పత్రికలో లేఖలు , వ్యాసాలూ వ్రాసేవాడు , కార్టూన్స్ గూర్చి ముందుగా తెలిసింది అతని ద్వారానే, నాకు బొమ్మలు వేయడం వచ్చునని తెలుసుకుని కార్టూన్స్ గీయమని ప్రోత్సహించే వాడు, కాని నేను పంపిన కార్టూన్స్ ఏవికూడా ప్రచురణకి ఎంపిక కాలేదు, ఆ రోజుల్లో "శంకర్ శ్రీగద్దె కార్టూనిస్టు" గారు ఆంధ్రభూమి వారపత్రికలో విరివిగా కార్టూన్స్ వేసేవారు, ఒక రోజు ప్రభాకర్ రెడ్డి , శంకర్ శ్రీగద్దె గారితో పరిచయం చేసాడు, ఆ రోజు కార్టూన్స్ ఎలా వేయాలి , ఎ సైజు , పంపే విదానం , అన్ని విషయాలు శంకర్ శ్రీగద్దె గారు నాకు వివరంగా తెలియజేయడం జరిగింది.
డిగ్రీ తో నా చదువు ఆపేయడం , వ్యాపారంలో తలమునకలవడం , కార్టూన్ లని మరచి పోవడం జరిగింది .
తరువాత నా మిత్రుడు ప్రభాకర్ రెడ్డి యేలేటి ఈనాడు దిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్గా ఉద్యోగం లో స్థిరపడి, కొన్నాళ్ళకు మేము కలసి నపుడు కార్టూన్ల ప్రస్థావన తేవడం జరిగింది , మళ్ళి నా మనసు కార్టూన్ల వైపు మళ్ళింది .
ఇక ఈ కార్టూన్ అచ్చు కావడానికి శంకర్ శ్రీగద్దె గారి సలహాలు ఎంతో ఉపయోగ పడ్డాయి , తరువాత విజయ్ కార్టూనిస్ట్ గారు , వినోద్ కార్టూనిస్ట్ గారు , వడ్డేపల్లి వెంకటేష్ గారు, రామ్మోహన్ గారు, కందికట్ల s . v . గారు , అర్జున్ కార్టూనిస్ట్ గార్లు ఎన్నో విలువైన సలహాలు , పత్రికల చిరునామలు తెలియపరచి నేను కార్టూన్స్ వేయడానికి ఎంతో సహకరిస్తున్నారు .
ఇప్పుడు గురుదేవులు జయదేవ్ గారి అమూల్యమైన సూచనలతో , ప్రతి విషయం పైన ఆయన ఏర్పరుస్తున్న అవగాహనతో , ముందుకు సాగుతున్నాను . గురుబ్యోనమః
మిత్రులు , వెల్ విషర్ రామశేషు గారు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు .
మన కార్టూనిస్టు మిత్రులలో ఉన్నంత ఆహ్లాద కర వాతావరణం , స్నేహ భావం , పరస్పర సహకారం , ఏ ఇతర రంగాలలో ఉండదు కాబోలు . జైహొ కార్టూన్లు, జైహొ కార్టూనిస్టులు .
నా కార్టూనిస్టు మిత్రులు , గురువులు అందరికి శత కోటి హ్రిదయపూర్వక ధన్యవాదములు .
తెలుగు కార్టూనిస్టు లందరికి అనంత కోటి వందనములు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి