బురఖా ధరించిన ఒక అమ్మాయి పొద్దున్నే వచ్చింది మా షాపులోకి , నావైపు ఒక్క క్షణం ఓరగా చూసింది , “మీకు వచ్చే కొలతలతో ఒక షర్ట్ కావాలండి” అడిగింది . “అదికూడ మీకు బాగా నచ్చిన , మీ షాప్ లోనే ఖరీదైన ,నాణ్యమైనది ” కావాలి . చెబుతున్నంత సేపు నన్నే అదోలా చూస్తుంది ,ముఖం మొత్తం కప్పి ఉన్నా కళ్ళల్లో భావాలు స్పష్టంగా తెలుస్తున్నాయి . షాపులో ఉన్న అన్నిరకాల ,నాణ్యమైన షర్ట్స్ తీసి చూపించాను. కాసేపు చూసి మల్లి నన్నే వాటి లోంచి మంచి నాకు నచ్చిన నాలుగు చొక్కాలుతీయమని , వాటన్నిటిని వేసుకుని చూడమంది కాస్త అధికారికంగా . ఈ సారికాస్త కంగారు పడ్డాను. నాకు బాగా నచ్చిన ఒక చొక్కా ఎంపిక చేసుకుని , బేరం ఆడకుండానేను ఎంత చెబితే అంత నా చేతిలో పెట్టి, “బాయ్”…………………..., అంటూ మల్లి ఒక్క సారి ఓరగా చూసింది . ఈ సారి ఆవిడ చూపు నా ఆలోచనల్నిఆవిడ చుట్టూ తిరిగేలా చేసింది . ఇక ఆ రోజంత నేను నేనుగా లేను , ఆవిడాఎందుకలా చూసింది , నా సైజు చొక్కా ఎందుకు తీసుకుంది , ఎందుకు నన్నువేసుకుని చూడమంది , ఇదివర కెప్పుడు షాపులో ఇలాంటి సంగటన జరగ లేదు . భోం చేస్తున్నాను , మా ఆవిడ ఏదో చెబుతుంది , నా కేమి వినిపించడంలేదు, బురఖ స్త్రీ గురించే ఆలోచన ……………………….ఆలోచిస్తూనే ఉన్న ఎప్పుడుపడుకున్ననో . ఏమండి ….. ఏమండి ………………………., మా ఆవిడనన్ను కుదుపుతూ లేపింది,”అబ్బ ఎంటే అర్దరాత్రి నీ గోల ” ఒక్క క్షణం లేచి అలాగే కూర్చోండి, అంటూ వెళ్లిగదిలోనుండి అందంగా అలంకరించిన ఒక అట్ట పెట్టె తెచ్చి నా చేతిలో పెట్టి, “పతిదేవులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ” అంది ఆహ్లాదంగా నవ్వుతు………….. , ఒక్కసారిగా నా నిద్రమత్తు వదిలి పోయి , ఆనందం తో ఉబ్బిపోయ………………………..,దగ్గరికి పిలుచుకుని నుదుటిపైన ముద్దుపెట్టుకుని , పక్కనేకూర్చోపెట్టుకుని , తను ఇచ్చిన బహుమతి విప్పిచూసా, ఆశ్చర్యం ………………………… ఈషర్టు,…………………….., నేను,…………………,పొద్దున్న,………………..……….., బురఖా,……………..,స్త్రీ,……………, అంటే,,……………, బురఖాలో…………….., అవునన్నట్లుగా ఓరగా చూసింది మా ఆవిడ ……………… అదేచూపు ………………………..అవును అదే చూపు . - See more at: http://teluguvennela.org/ade-choopu/#sthash.jxdbnCvX.dpuf
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి