గండం గడవలేదు
ఏయ్ ఆటో నేను చెప్పిన అడ్రస్ ఏంటి నువ్వు తీసుకేల్తున్నదేటు ....................
ఏయ్ పోరి మాట్లాడకుంట నోర్ముసుకుని కూసో , నేన్ తీస్కుపోయినదిక్కు సూడు ..., చల్ , అరిచాడు.
ఏం జరగబోతుందో అప్పుడర్థమైంది , గుండె దడ పెరిగింది ..................,
రాత్రి తొమ్మిది దాటే వరకు షాపింగ్ చేసి వంటరిగా ........................, షిట్ .॥॥
షాపింగ్ మాల్ దగ్గర పక్కింట్ పొకిరివెధవ రాజుగాడు లిఫ్ట్ ఇస్తానంటే వాడి వంకర బుద్ధి నచ్చక తిరస్కరించి, చక్కగా వచ్చి పులిబోనులో చిక్కినట్లైంది . అయ్యో ....... అయ్యో ............!!!!!
ఒంట్లో వణుకు మొదలైంది , నన్ను నేనే కాపాడు కోవాలి , గట్టిగా గుండెలనిండా గాలి పీల్చుకుని తక్షణ కర్తవ్యం ........... ఎలా ...... ఎలా .........!!!!!!
క్రమంగా ఆటో జనావాసాలకు దూరంగా వెళ్తోంది , ఆటో వాడు వేగం పెంచాడు ....... ఏ క్షణమైనా నన్ను ..... వాడు .......
ఇక ఆలోచించి లాభంలేదు , షాప్ లో కూరగాయలు కోయడానికని కొన్న కత్తి బాగులోంచి టక్కున తీసి వాడి వీపుకి ఆన్చి పట్టుకున్న ..............,
ఒరేయ్ మర్యాదగా ఆటో వెనక్కి తిప్పి నేను చెప్పిన దిక్కు వేల్లకపోయావో .............. గట్టిగా అరిచినంత పనిచేసాను .......... వాడు బెదరలేదు, ఏయ్ చొక్రి బయపడతాననుకున్నావా ...... అయిసా మై బహుత్ దేఖా ........ గొంతు పెంచాడు .
కత్తి చేతులోకి రాగానే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో , వాడి మాటలు పట్టించు కోకుండా కత్తి ని కాస్త గట్టిగా వాడి వీపుకి వత్తి పట్టుకుని ఆటో తిప్పుతావా లేదా ...... అరిచాను .
కత్తి వాడి వీపులోకి గుచుకున్నట్లుంది చొక్కా చిరిగి రక్తం బోట బొటా .... కారడం మొదలైంది .
అబ్బా .......!!!!! ఒక్కసారిగా అరిచాడు . మూ ..... ఆటో తిప్పు ......... నేను తగ్గలేదు .
భయం నా నుండి వాడికి బదిలీ అయింది .......,
ఆటోని నేను చెప్పిన దారిలోకి మళ్ళించాడు
గుండెల్లోంచి తన్నుకొస్తున్న వణుకుని పంటికింద వత్తి పట్టుకుని ఆటోవాన్ని , రోడ్డుని జాగర్తగా గమనిస్తున్నాను .
ఆటో మా ఇంటి రోడ్డుకి దగ్గరౌతుంది ........... అప్పుడు లిఫ్ట్ ఇస్తానన్న రాజుగాడు....... అవును వాడే అటువైపే వెళ్తున్నాడు , క్షణం కూడా ఆలోచించకుండా ............... రాజూ ............... అరిచాను . నా గొంతువినగానే రాజు బండి ఆపి ఆటోకేసి చూసాడు .
ఆపరా ....... ఆటోవాడికేసి చూస్తూ అన్నాను ..... ఆటో కాస్త నెమ్మదించగానె , ఒక్క అంగలో ఆటో దూకి వెళ్లి రాజు బైక్ పైనెక్కి కూర్చున్నాను క్షణాల్లో .....................
ఆటో వాడు అక్కడినుండి వేగంగా కనుమరుగయ్యాడు ................
బైక్ ముందుకు కదిలింది .................. ఇంటికేనా ?............................ ఏం జరిగింది ?.......................
అకస్మాతుగా అటో దిగి వాడి బైక్ పైన కూర్చున్న నన్ను కాస్త అనుమానంగా , ఆశ్చర్యంగా , అడుగుతున్నాడు ..........................
అప్పటిదాకా గుండెల్లో అదిమి పట్టుకున్న దుఃఖం కళ్ళ నుండి తన్నుకొస్తుంది ......... ఆపుకోలేక పోతున్న ................................................ వాడు మాట్లాడుతున్నాడు , నాకు ఏమి విన్పించడం లేదు .......... భయం నా చెవిలో హూంకరిస్తోంది ........................... గండం గడవలేదు ...............!!!!!!!!
రాజు ఒక మగాడే కద .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి