ఇది నేను రామశేషు కార్టూనిస్టు గారితో 20-05-2012, తొలి తెలుగు కార్టూనిస్టు ల దినోత్సవం నాడు దిగిన ఫోటో .
అప్పుడు మొదలైన్ది మా స్నేహం , ఆ రోజుల్లో రామశేషు గారు హాస్యానందం మాస పత్రికలో " రామశేషు సమర్పించు సిని ట్యూన్స్ " అనే ఫీచర్ కార్టూన్స్ ఫుల్ పేజి లో వేసేవారు , వాటికి నేను వీరాభిమానిని , ఆ కార్టూన్స్ నన్ను ఎంతగా ఆకట్టు కున్నాయంటే ఆ కార్టూన్స్ లో బొమ్మలు నాతో మాట్లాడేవి , కదిలేవి , కదిలించేవి . అంత లైవ్ లి గా ఉండే బొమ్మలు ఆయన సొంతం .
అలా ఫీచర్ కార్టూన్స్ వేయాలని నాకు అనిపించేది , ఆ విషయం ఒక సారి రామశేషు గారి వద్ద ప్రస్థావిస్తే , www.teluguvennela.com గురించి తెలియజేసి , " రాబోవు రోజుల్లో " అనే అంశం తో కార్టూన్లు గీయమని ప్రోత్సహించారు, దానికి సంబందించిన సలహాలు అందించారు .
ఇప్పుడు మీరు చూసేది "రాబోవు రోజుల్లో " 50 వ కార్టూన్ . ఎన్నో అనుమానాలతో మొదలెట్టిన ఈ ఫీచర్ లో నేను 50 కార్టూన్లు పూర్తి చేసానంటే దానికంతటికి రామశేషు గారి ప్రోత్సాహం, సలహాలే కారణం .
ఆయన నాకు స్నేహితుడు, శ్రేయోభిలాషి, ఫిలాసఫర్, ఆయన బొమ్మలు కార్టూన్లు , నాకు గురువులు .
రామశేషు గారు మీతో స్నేహం ఇలాగే కొనసాగాలని, మీరు నవ్వుతు , మీ కార్టూన్లతో నవ్విస్తూ, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని , ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి