తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు జయంతి , మే 20 వ తేది తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం రవీంద్ర భారతి కాన్ఫరెన్సు హాల్లో అత్యంత వైభవంగా జరిగింది .
సత్కళా భారతి ఆద్వర్యంలో, aegis వారి సౌజన్యమ్థొ హాస్యానందం నిర్వహించిన ఈ పండుగ ఆహ్లాదకరంగా జరిగింది .
రెండు తెలుగు రాష్ట్రాల నుండి విచేసిన కార్టూనిస్టులు , కార్టూన్ ఇష్టులు , ముఖ్య అతిథులు సర్వశ్రీ k . v . రమణాచారి గారు, తనికెళ్ళ భరణి గారు, l . b . శ్రీరాం గారు, బాపు గారి తమ్ముడు ప్రముఖ చిత్రకారులు శ్రీ శంకర్ గారు,aegis శ్రీనివాస్ గారు, వేగిరాజు సుబ్బరాజు గారు,m . s . రామకృష్ణ గార్ల తో సభ నిండు తనాన్ని ఆపాదించుకుంది .
శ్రీ b . s . శర్మ గారు వ్యాఖ్యాత గా , మహిళా కార్టూనిస్టు వాగ్దేవి గారి ప్రార్థన తో సభ ప్రారంబించారు .
స్వర్గీయ తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు గారికి , బాపు రమణ లకి , పొలిటికల్ కార్టూనిస్టు శేఖర్ గారికి , తొలి తెలుగు మహిళా కార్టూనిస్టు రాగతి పండరి గారికి పూల మాలలతో అంజలి ఘటించి , జ్యోతి ప్రజ్వలన చేసారు .
ముందుగా శ్రీ తనికెళ్ళ భరణి గారు ప్రసంగిస్తూ , కార్టూన్లను , వాటిని గీసే కార్తూనిస్తులను ప్రశంశించారు . తనకి కార్టూన్ల పైనగల అభిమానాన్ని ఉటంకించారు . కార్టూనిస్టు లేన్దరినో ప్రోత్సహిస్తూ , పైసా ఆశించకుండా పన్నెండు సంవత్సరాలుగా హాస్యానందం మాస పత్రికను నడుపుతున్న రాము గారిని , హాస్యానందం రాముగా అభివర్ణించారు , ఆయన కృషిని కొనియాడారు . నాలుగు సంవత్సరాలుగా జరుపుకుంటున్న కార్టూనిస్టుల దినోత్సవం కార్టూనిస్టు లందరినీ ఒక్కచోట కలిపే వేదిక మారిందని అన్నారు .
పని ఒత్తిడి మూలంగా కార్టూన్ పోటిలో బహుమతి విజేతలు సర్వశ్రీ ఆకుండి . సాయి రామ్ , రామశేషు, రామ శర్మ ,రావెళ్ళ,శేఖర్,లేపాక్షి,క్రిష్ణ ,హరి,సునీల,అరుణ్,బివిఎస్ ప్రసాద్, చక్రవర్తి, నాగిశెట్టి, శివాజీ, నాగ్రాజ్ , వడ్డేపల్లి వెంకటేష్, ఎమెమ్ మురళి , రాంప్రసాద్ , బండి రవీందర్, శంబంగి , సంతోష్ కౌతమ్ , కశ్యప్ , మాంట్ క్రిస్టో లకు , బహుమతి ప్రదానం.
శ్రీ సత్ కళా భారతి సత్యనారాయణ గారు మాట్లాడుతూ , నాలుగు సంవత్సరాలుగా జరుపుకుంటున్న కార్టూనిస్టుల దినోత్సవం , దానికోసం నిర్వహించే కార్టూన్ పోటిలు విజయవంతం కావడానికి ముక్య కారకులు శ్రీ కె వి రామనాచారి గారేనని , వారు ప్రభుత్వ సలహా దారు మాత్రమే కాదని , ప్రపంచ తెలుగు వారందరి సలహాదారు, సహాయ దారులని కీర్తించారు . చంద్రుడికో నూలు పోగులా ఆయన్ని శాలువాతో సత్కరించారు .
ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహకారం అందించిన aegis శ్రీనివాస్ గారు , కార్టూనిస్టు లకు శుభాకాంక్షలు తెలిపారు ,
రాము గారిని అభినందించారు , ఈ అవకాశం కల్పించిన శ్రీ కె వి రమణ చారి గారికి ధన్యవాదములు తెలిపారు .
బాపు రమణ అవార్డు ప్రదాత ఆత్రేయ పురం , శ్రీ వేగిరాజు సుబ్బరాజు గారు మాట్లాడుతూ , ఇకనుండి సీనియర్ కార్టూనిస్టు లైన ఒకరికి ప్రతి సంవత్సరం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, అత్యదికంగా కార్టూను లు పత్రికలలో ప్రచురితమైన కార్టూనిస్టు కి 5000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించాం అని తెలిపారు .
శ్రీ కె వి రమణ చారి గారు మాట్లాడుతూ , విజేతలైన కార్టూనిస్టు లందరి పేర్లు ప్రస్తావించి శుభాకాంక్షలు తెలిపారు ,
కార్టూన్ల పైన తన మక్కువని తెలుపుతూ కొన్ని కార్టూన్లని ప్రస్తావించి సభలో నవ్వులు పూయించారు , రాము గారి ని ప్రశంశించి శాలువాతో సత్కరించారు, సత్కళా భారతి సత్యనారాయణ గారు కూడా రాము గారిని సత్కరించారు. ప్రతి నెలా ఒక కార్టూనిస్టు పేర ప్రతేక సంచిక తీసుకు రావాలని సూచించారు .
అనంతరం శ్రీ ఎల్బి శ్రీరాం గారి హాస్యానందం ప్రత్యేక సంచిక ఆవిష్కరించి , ఎల్బి శ్రీరాం గారు ప్రసంగించారు, నేను గొప్ప వాడిని కాబట్టి నా ప్రత్యేక సంచిక రాము గారు రూపొందించలేదు, ప్రత్యెక సంచిక వేసారు కాబట్టే నేను గొప్పవాడిని అయ్యాను , అన్నారు . కార్టూనిస్ట్ లకు శుభాకాంక్షలు తెలిపారు . కార్టూన్ ల పైన తన అభిమానాన్ని చాటారు . రాము గారిని పూల మాల శాలువాతో సత్కరించారు .
ఎం ఎస్ రామకృష్ణ గారు మాట్లాడుతూ , ఎన్ని కార్టూన్ లు వేసా మన్నది కాదు, ఎన్ని మంచి కార్టూన్ లు వేసామన్నది చూసు కావాలన్న బాపు గారి మాటలని గురుతు చేసారు .
అనంతరం బాపు రమణ అవార్డు తో శ్రీ బాచి గారిని శాలువా,మొమెంటో ,ప్రశంశ పత్రంతో సన్మానించారు. శ్రీ శంకర్ గారు వేసిన తలిశెట్టి రామారావు గారి చిత్రాన్ని ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతి విజేతలకి , బాపు రమణ అవార్డు విజేతకి అందించారు .
వ్యాఖ్యత బిఎస్ శర్మ గారి కొన్ని వ్యాఖ్యలతో సభలో నవ్వులు పూసాయి .
రాము గారి వందన సమర్పణ తో సభ ముగుసింది .
కార్టూనిస్టు ల ఆలింగానాలు, కరచాలనాలు , శుభాకాంక్షలతో , మధురమైన అనుభవాన్ని పదిలంగా దాచుకుని మరో మధురమైన సంవత్సరం కోసం ఆశతో , ఆనందంతో విశ్రమించారు .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి