28, డిసెంబర్ 2015, సోమవారం
23, డిసెంబర్ 2015, బుధవారం
విజయవంతమైన కార్టూన్ ల ప్రదర్శన
సర్వశ్రీ ఎమ్. ఎస్. రామకృష్ణ, బాచి , సరసి , లేపాక్షి , బండి రవీందర్, నాగ్రాజ్ గార్లు ఆరుగురు కార్టూనిస్టుల సంకల్పం కృషి వెరసి మాదాపూర్ " స్టేట్ ఆర్ట్ గ్యాలరి " కావూరి హిల్స్ , హైదరాబాద్ లో నిర్వహించిన కార్టూన్ల ప్రదర్శన విజయవంత మైంది .
తేది 19 డిసెంబెర్ నుండి 21 డిసెంబెర్ వరకు నిర్వహించిన ఈ కార్టూన్ల ప్రదర్శనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ బి. వెంకటేశ్వర్లు i.a.s. , గారు జ్యోతి వెలిగించి ప్రారంబించారు , ఈ కార్యక్రమంలో ఆర్ట్ గ్యాలరి డైరెక్టర్ శ్రీ మనోహర్ గారు, శ్రీ దైవజ్ఞ శర్మ గారు, ప్రముఖ కార్టూనిస్టులు సర్వశ్రీ E R M రాజు గారు,అరుణ్ గారు,వర్చస్వి గారు ,రామ్ శేషు గారు , నూకాపతి గారు, హరికృష్ణ గారు, కొండ రవి ప్రసాద్ గారు, ప్రముఖ చిత్రకారులు బాలు గారు , వాసు గారు , వేగి రాజు సుబ్బరాజు గారు, కార్టూన్ ఇష్టులుమచిలీ పట్నం పామరు కృష్ణ గారు, జి సి పద్మాదాస్ గారు, A R సుధాకర్ గారు పాల్గొన్నారు .
ప్రదర్శనలో ఉంచిన కార్టూన్లను తిలకించిన శ్రీ బి . వెంకటేశ్వర్లు ఐఏఎస్ ముఖ్య అతిథి గారు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు, ఇంతటి అద్బుతమైన ప్రదర్శనని నిర్వహించిన ఆరుగురు కార్టూనిస్ట్ లను మనసారా అభినందించారు , కార్టూన్ అనేది ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని అది ఎంతో తెలివితో , ఆలోచనతో వేయవలసి ఉంటుంది అని వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జరగాలని కోరుకున్నారు . అరగంట మాత్రమే సమయం కేటాయించిన ఆయన ప్రదర్శనను తిలకిస్తూ , ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ తొంబై నిమిషాలు అక్కడే గడిపారు .
ఆహ్వానితులందరికి టీ , బిస్క్ ట్లు ఏర్పాటు చేసారు .
ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన కార్టూనిస్టు లు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు , ప్రతి ఒక కార్టూనిస్ట్ ఇలాంటి ప్రదర్శనను నిర్వహించాలని అభిలషించారు , ప్రదర్శనలకు సంబంధించి ఎన్నో విలువైన సలహాలు సూచనలు , కార్టూన్ వేసే విధానం గూర్చి ఎంతో సమాచారాని శ్రీ ERM రాజు గారు అందించారు , ప్రముఖ చిత్రకారులు సర్వశ్రీ బాలు గారు , వాసు గారు, చిత్ర గారు, ఆనంద్ గారు, వేగిరాజు సుబ్బరాజు గారు తమ సంతోషాన్ని వ్యక్త పరిచారు, తమ అభిప్రాయాలను విసిటేర్స్ లిస్టులో పొందుపరిచి ఆనందంగా వెనుతిరిగారు .
సిని దర్శకులు శ్రీ ముళ్ళపూడి వర గారు, శ్రీ గాంధి గారు , ఈ ప్రదర్శన మాకెంతో నావ్వుల్ని ఆలోచనలని పంచింది అన్నారు .
ప్రముఖ కార్టూనిస్టు బన్ను గారు ప్రదర్శనని సందర్శించి అందర్నీ ఉత్సాహ పరిచారు ,
పెద్దలే కాకుండా పిల్లలు కూడా ప్రదర్శనకి రావడం కార్తూన్లని ఎంజాయ్ చేయడం ప్రదర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది , ప్రదర్శనకి తిలకించడానికి వచ్చిన పిల్లలు ,పెద్దలు , స్త్రీలు , సీనియర్ సిటిజెన్లు అందరు ఎంతో ఆనందాన్ని , ఉత్సాహాన్ని మూటగట్టుకుని తమ అభిప్రాయాన్ని విసిటేర్స్ లిస్టు లో వారి ఆనందాన్ని వ్రాసి ఎన్నో నవ్వుల్నీ మోసుకెళ్ళారు . శ్రీ బాచి గారి హాస్య రస కార్టూన్లు, శ్రీ సరసి గారి అపార్ట్ మ్మేంట్ కార్టూన్ లు , నాగ్రాజ్ గారి మెసేజ్ కార్టూన్ లు ,శ్రీ బండి రవీందర్ గారి చమత్ కార కార్టూన్ లు , శ్రీ రామకృష్ణ గారి నావ్వుల పువ్వుల కార్టూన్ లు , శ్రీ లేపాక్షి గారి పంచ్ కార్టూన్ లు అందరి సందర్శకులను హత్తుకున్నాయి .
కార్టూన్ ఇష్టులు ఫేస్ బుక్ గ్రూప్ లలో కార్తూన్లని ప్రేమించే సర్వశ్రీ జే సి పద్మదాస్ గారు , శ్రీనివాస రావు వేముగంటి గారు , ముమ్మిడి పద్మిని గారు, ప్రతిభ అంచ గారు, వేణుగోపాల్ నెల్లుట్ల గారు ఆనంద డోలికల్లో తేలి పోయారు .
ప్రదర్శనకి విచ్చేసిన నవ్య వీక్లీ సంపాదకులు ప్రఖ్యాత రచయిత శ్రీ జగన్నాధ శర్మ గారు కార్టూన్ లని తిలకించి ఎంతో ఉత్సాహంగా వారి అభిప్రాయాలను వ్యక్త పరిచారు, ఎంతో విలువైన వారి సమయాన్ని కేటాయించి , వారి అనుభవాలను , ఆలోచనలను, పంచుకున్నారు ప్రదర్శకులతో ఉల్లాసంగా గడిపి చిరు సత్కారాన్ని స్వీకరించి , మీతో నాలుగ్గంటలు యిట్టె గడిపానంటే నమ్మలేక పోతున్న భలే సంతోషం అని వారు అనడం కొస మెరుపు .
కార్టూన్ల ప్రదర్శన ఆరంభం నుండి చివరిదాకా ప్రదర్శకులలో ఒకరైన శ్రీ బాచి గారి శ్రీమతి శాంతి గారు, కూతురు మధు గారు, చిన్నారి కార్టూనిస్టు గాయత్రి వారి సహాయాన్ని అందిచడం ముదావహం .
మొత్తానికి ఈ కార్టూన్ల ప్రదర్శన విజయవంతమై ఎంతో మంది కార్టూనిస్టుల లో ఉత్సాహాన్ని , అందాన్ని , ప్రేరణని కలిగించింది . మరిన్ని కార్టూన్ ప్రదర్శనలు జరగడానికి ప్రేరణగా నిలిచింది .
నాలాంటి యువ కార్టూనిస్టు లకు మహామహులైన సర్వశ్రీ ఏం. ఏశ్. రామకృష్ణ గారు, సరసి గారు, బాచి గారు, లేపాక్షి గారు, బండి రవీందర్ గార్ల ప్రోత్సాహం, వారి ప్రేమ , ఆదరణ , వారి ఆలోచనలు నాకు వారి పైన ఉన్న గవురవాన్ని రెట్టింపు చేసాయి , నా బాటకు కొత్త వెలుగుని ప్రసాదించాయి .
16, డిసెంబర్ 2015, బుధవారం
తప్పక రండి
తప్పక రండి
తేది ఈ నెల 19 శనివారం, మొదలు 21 సోమవారం వరకు, కార్టూన్ల ప్రదర్శన ......
తెలుగు కార్టూన్ లోకం లో లబ్దప్రతిష్టులు , ఉద్ధండులైన సర్వశ్రీ సరసి గారు, ఎమ్. ఎస్. రామకృష్ణ గారు, బాచి [ అన్నం శ్రీధర్ ] గారు, లేపాక్షి గారు, బండి రవీందర్ గారు వారి కార్టూన్ లతో పాటు నా కార్టూన్లను కూడా ప్రదర్శనకు స్వీకరించి నాకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన మీకు సదా ఋణ పడి ఉంటాను . హృదయపూర్వక ధన్యవాదములు సర్ .
మిత్రులు మా ప్రదర్శనకు తప్పకుండా విచ్చేసి విజయవంతం చేయగలరని మనవి .

13, డిసెంబర్ 2015, ఆదివారం
11, డిసెంబర్ 2015, శుక్రవారం
7, డిసెంబర్ 2015, సోమవారం
15, నవంబర్ 2015, ఆదివారం
18, సెప్టెంబర్ 2015, శుక్రవారం
ఈ మధ్యకాలం లో కార్టూనిస్టు లు ఫేస్బుక్ లాంటి మాధ్యమాలలో ఎదుర్కొంటున్న ఒక సమస్య : మన హిందూ పండగల అంశంతో , పురాణాల అంశంతో,దైవ సంబదిక అంశాలతో కార్టూన్లు వేస్తే ...... { ఎ కార్టూనిస్టు పని కట్టుకుని మన సంస్కృతిని కించపరచాలని అలాంటి కార్టూన్ లు వేయడు, హాస్యానికి మాత్రమే అదీ సున్నితంగా, ఆలోచించి వేస్తాడు . } అవి మన సంప్రదాయాన్ని,సంస్కృతిని,దైవాన్ని కించపరుస్థున్నయని, కార్టూనిస్ట్ మన సంప్రదాయకి మచ్చ తెచ్చాడని , నెటిజన్లు లబోదిబో మంటూ .... కార్టూనిస్టు ని నానా దుర్భాశలాడుతూ ..., కించపరిచే పద ప్రయోగాలు చేస్తున్నారు.
కార్టూనిస్టు ఫేస్బుక్ లో పోస్టు చేసిన ఆ కార్టూన్ దాదాపుగా ఏదైనా పత్రికలో లేదా అంతర్జాల పత్రికలో ఆమోదం పొంది ప్రచురితం ఐనదే , అంటే ఒక సర్వజ్ఞుడైన సంపాదకుని ఆమోదం పొందినదే.
ఐన నాకు అర్థం కాదు...... దొంగ వేషాలు వేసి , దేవుడి బిడ్డలమని చెప్పుకుని , స్త్రీలని, పిల్లలని, పెద్దలని , ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ కోట్లు గడిస్తున్న , గడించిన , దొంగ స్వాములని నమ్మి, నమ్ముతూ, నిరంతరం మోసపోతూనే ఉన్నాం . అలాంటి వారు మన సంస్కృతిని , సాంప్రదాయాలను, కించ పరుస్తున్నారు, మన దేవుళ్ళను కించ పరుస్తున్నారు, మోసగాల్లైన స్వాములను గూర్చి ప్రపంచానికి తెలిస్తే, ఆ స్వాములు అప్పటి వరకు చేసిన దైవ ప్రచారం , విదేశీయులకు మన మీద చులకన భావం కలుగజేస్తుంది . అలాంటి వారి పైన మీ కోపాన్ని, దుర్భాశా ప్రయోగాన్ని చేయండి.
అంతే కాని నవ్వించాలని చూసిన కార్టూనిస్టు పైన కాదు .
ఒక వేల మీకు కార్టూన్ నచ్చక పోతే నచ్చలేదు అనండి , దుర్భాష లాడకండి దయచేసి ......
మేము నాస్తికులం కాదు , భారతీయులం పైగా మన సాంప్రదాయాలకు, సంస్కృతికి, దైవానికి అత్యంత విలువనిచ్చే వాళ్ళం .
మేము తెలుగు వాళ్ళం , మేము భారతీయులం . గర్వంగా ............. సగర్వంగా ............

13, సెప్టెంబర్ 2015, ఆదివారం
12, సెప్టెంబర్ 2015, శనివారం
26, ఆగస్టు 2015, బుధవారం
15, ఆగస్టు 2015, శనివారం
27, జులై 2015, సోమవారం
కాలమనే ఇసుకతిన్నెలపై నీ పాద ముద్రలు కనిపించాలంటే .......
ఈసురోమని కాల్లీడ్చుకుంటూ నడవకు ................... !!!!!
A.P.J. అబ్దుల్ కలాం .....
స్వామీ వివేకానందుడి తరువాత , మనదేశ యువత పైన అంతటి ప్రభావాన్ని చూపిన మహనీయుడు అబ్దుల్ కలాం గారేనంటే అతిశయోక్తి కాదు .
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను .

1, జులై 2015, బుధవారం
22, జూన్ 2015, సోమవారం
16, జూన్ 2015, మంగళవారం
విశిష్ట బహుమతి
మే 20 , 2015 . రవీంద్రభారతి కాన్ఫరెన్సు హాల్లో జరిగిన తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం నాడు , తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు స్మారక కార్టూన్ పోటిలో విశిష్ట బహుమతి , సిని నటులు, రచయిత శ్రీ ఎల్ . బి . శ్రీరాం గారి చేతుల మీదుగా స్వీకరిస్తున్న సందర్బం , పక్కన సిని నటులు , దర్శకులు, రచయిత, శ్రీ తనికెళ్ళ భరణి గారు కూడా ఉన్నారు .
23, మే 2015, శనివారం
మే 20 వ తేది తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం
తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు జయంతి , మే 20 వ తేది తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం రవీంద్ర భారతి కాన్ఫరెన్సు హాల్లో అత్యంత వైభవంగా జరిగింది .
సత్కళా భారతి ఆద్వర్యంలో, aegis వారి సౌజన్యమ్థొ హాస్యానందం నిర్వహించిన ఈ పండుగ ఆహ్లాదకరంగా జరిగింది .
రెండు తెలుగు రాష్ట్రాల నుండి విచేసిన కార్టూనిస్టులు , కార్టూన్ ఇష్టులు , ముఖ్య అతిథులు సర్వశ్రీ k . v . రమణాచారి గారు, తనికెళ్ళ భరణి గారు, l . b . శ్రీరాం గారు, బాపు గారి తమ్ముడు ప్రముఖ చిత్రకారులు శ్రీ శంకర్ గారు,aegis శ్రీనివాస్ గారు, వేగిరాజు సుబ్బరాజు గారు,m . s . రామకృష్ణ గార్ల తో సభ నిండు తనాన్ని ఆపాదించుకుంది .
శ్రీ b . s . శర్మ గారు వ్యాఖ్యాత గా , మహిళా కార్టూనిస్టు వాగ్దేవి గారి ప్రార్థన తో సభ ప్రారంబించారు .
స్వర్గీయ తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు గారికి , బాపు రమణ లకి , పొలిటికల్ కార్టూనిస్టు శేఖర్ గారికి , తొలి తెలుగు మహిళా కార్టూనిస్టు రాగతి పండరి గారికి పూల మాలలతో అంజలి ఘటించి , జ్యోతి ప్రజ్వలన చేసారు .
ముందుగా శ్రీ తనికెళ్ళ భరణి గారు ప్రసంగిస్తూ , కార్టూన్లను , వాటిని గీసే కార్తూనిస్తులను ప్రశంశించారు . తనకి కార్టూన్ల పైనగల అభిమానాన్ని ఉటంకించారు . కార్టూనిస్టు లేన్దరినో ప్రోత్సహిస్తూ , పైసా ఆశించకుండా పన్నెండు సంవత్సరాలుగా హాస్యానందం మాస పత్రికను నడుపుతున్న రాము గారిని , హాస్యానందం రాముగా అభివర్ణించారు , ఆయన కృషిని కొనియాడారు . నాలుగు సంవత్సరాలుగా జరుపుకుంటున్న కార్టూనిస్టుల దినోత్సవం కార్టూనిస్టు లందరినీ ఒక్కచోట కలిపే వేదిక మారిందని అన్నారు .
పని ఒత్తిడి మూలంగా కార్టూన్ పోటిలో బహుమతి విజేతలు సర్వశ్రీ ఆకుండి . సాయి రామ్ , రామశేషు, రామ శర్మ ,రావెళ్ళ,శేఖర్,లేపాక్షి,క్రిష్ణ ,హరి,సునీల,అరుణ్,బివిఎస్ ప్రసాద్, చక్రవర్తి, నాగిశెట్టి, శివాజీ, నాగ్రాజ్ , వడ్డేపల్లి వెంకటేష్, ఎమెమ్ మురళి , రాంప్రసాద్ , బండి రవీందర్, శంబంగి , సంతోష్ కౌతమ్ , కశ్యప్ , మాంట్ క్రిస్టో లకు , బహుమతి ప్రదానం.
శ్రీ సత్ కళా భారతి సత్యనారాయణ గారు మాట్లాడుతూ , నాలుగు సంవత్సరాలుగా జరుపుకుంటున్న కార్టూనిస్టుల దినోత్సవం , దానికోసం నిర్వహించే కార్టూన్ పోటిలు విజయవంతం కావడానికి ముక్య కారకులు శ్రీ కె వి రామనాచారి గారేనని , వారు ప్రభుత్వ సలహా దారు మాత్రమే కాదని , ప్రపంచ తెలుగు వారందరి సలహాదారు, సహాయ దారులని కీర్తించారు . చంద్రుడికో నూలు పోగులా ఆయన్ని శాలువాతో సత్కరించారు .
ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహకారం అందించిన aegis శ్రీనివాస్ గారు , కార్టూనిస్టు లకు శుభాకాంక్షలు తెలిపారు ,
రాము గారిని అభినందించారు , ఈ అవకాశం కల్పించిన శ్రీ కె వి రమణ చారి గారికి ధన్యవాదములు తెలిపారు .
బాపు రమణ అవార్డు ప్రదాత ఆత్రేయ పురం , శ్రీ వేగిరాజు సుబ్బరాజు గారు మాట్లాడుతూ , ఇకనుండి సీనియర్ కార్టూనిస్టు లైన ఒకరికి ప్రతి సంవత్సరం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, అత్యదికంగా కార్టూను లు పత్రికలలో ప్రచురితమైన కార్టూనిస్టు కి 5000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించాం అని తెలిపారు .
శ్రీ కె వి రమణ చారి గారు మాట్లాడుతూ , విజేతలైన కార్టూనిస్టు లందరి పేర్లు ప్రస్తావించి శుభాకాంక్షలు తెలిపారు ,
కార్టూన్ల పైన తన మక్కువని తెలుపుతూ కొన్ని కార్టూన్లని ప్రస్తావించి సభలో నవ్వులు పూయించారు , రాము గారి ని ప్రశంశించి శాలువాతో సత్కరించారు, సత్కళా భారతి సత్యనారాయణ గారు కూడా రాము గారిని సత్కరించారు. ప్రతి నెలా ఒక కార్టూనిస్టు పేర ప్రతేక సంచిక తీసుకు రావాలని సూచించారు .
అనంతరం శ్రీ ఎల్బి శ్రీరాం గారి హాస్యానందం ప్రత్యేక సంచిక ఆవిష్కరించి , ఎల్బి శ్రీరాం గారు ప్రసంగించారు, నేను గొప్ప వాడిని కాబట్టి నా ప్రత్యేక సంచిక రాము గారు రూపొందించలేదు, ప్రత్యెక సంచిక వేసారు కాబట్టే నేను గొప్పవాడిని అయ్యాను , అన్నారు . కార్టూనిస్ట్ లకు శుభాకాంక్షలు తెలిపారు . కార్టూన్ ల పైన తన అభిమానాన్ని చాటారు . రాము గారిని పూల మాల శాలువాతో సత్కరించారు .
ఎం ఎస్ రామకృష్ణ గారు మాట్లాడుతూ , ఎన్ని కార్టూన్ లు వేసా మన్నది కాదు, ఎన్ని మంచి కార్టూన్ లు వేసామన్నది చూసు కావాలన్న బాపు గారి మాటలని గురుతు చేసారు .
అనంతరం బాపు రమణ అవార్డు తో శ్రీ బాచి గారిని శాలువా,మొమెంటో ,ప్రశంశ పత్రంతో సన్మానించారు. శ్రీ శంకర్ గారు వేసిన తలిశెట్టి రామారావు గారి చిత్రాన్ని ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతి విజేతలకి , బాపు రమణ అవార్డు విజేతకి అందించారు .
వ్యాఖ్యత బిఎస్ శర్మ గారి కొన్ని వ్యాఖ్యలతో సభలో నవ్వులు పూసాయి .
రాము గారి వందన సమర్పణ తో సభ ముగుసింది .
కార్టూనిస్టు ల ఆలింగానాలు, కరచాలనాలు , శుభాకాంక్షలతో , మధురమైన అనుభవాన్ని పదిలంగా దాచుకుని మరో మధురమైన సంవత్సరం కోసం ఆశతో , ఆనందంతో విశ్రమించారు .

18, మే 2015, సోమవారం
సి . ప్రభాకర్ స్మారక గ్రంథాలయం కోరుట్ల వారు నిర్వహించిన , చేతి వ్రాత , చిత్రలేఖనం ఉచిత శిక్షణ శిభిరం నిన్నటి తో ముగిసింది, యాబై మంది పిల్లలకి శిక్షణను ఇవ్వడం జరిగింది . ముగింపు రోజున నాకు చిన్న అభినందన . శిక్షకులలో సర్వశ్రీ శంకర్ శ్రిగద్దె , చిన్నన్న, అశోక్ బొగ , మరియు చిత్రలేఖన నిపుణులు, చేతివ్రాత నిపుణులు కూడా మరికొందరు ఉన్నారు .
8, మే 2015, శుక్రవారం
"రాబోవు రోజుల్లో " 50 వ కార్టూన్ .
ఇది నేను రామశేషు కార్టూనిస్టు గారితో 20-05-2012, తొలి తెలుగు కార్టూనిస్టు ల దినోత్సవం నాడు దిగిన ఫోటో .
అప్పుడు మొదలైన్ది మా స్నేహం , ఆ రోజుల్లో రామశేషు గారు హాస్యానందం మాస పత్రికలో " రామశేషు సమర్పించు సిని ట్యూన్స్ " అనే ఫీచర్ కార్టూన్స్ ఫుల్ పేజి లో వేసేవారు , వాటికి నేను వీరాభిమానిని , ఆ కార్టూన్స్ నన్ను ఎంతగా ఆకట్టు కున్నాయంటే ఆ కార్టూన్స్ లో బొమ్మలు నాతో మాట్లాడేవి , కదిలేవి , కదిలించేవి . అంత లైవ్ లి గా ఉండే బొమ్మలు ఆయన సొంతం .
అలా ఫీచర్ కార్టూన్స్ వేయాలని నాకు అనిపించేది , ఆ విషయం ఒక సారి రామశేషు గారి వద్ద ప్రస్థావిస్తే , www.teluguvennela.com గురించి తెలియజేసి , " రాబోవు రోజుల్లో " అనే అంశం తో కార్టూన్లు గీయమని ప్రోత్సహించారు, దానికి సంబందించిన సలహాలు అందించారు .
ఇప్పుడు మీరు చూసేది "రాబోవు రోజుల్లో " 50 వ కార్టూన్ . ఎన్నో అనుమానాలతో మొదలెట్టిన ఈ ఫీచర్ లో నేను 50 కార్టూన్లు పూర్తి చేసానంటే దానికంతటికి రామశేషు గారి ప్రోత్సాహం, సలహాలే కారణం .
ఆయన నాకు స్నేహితుడు, శ్రేయోభిలాషి, ఫిలాసఫర్, ఆయన బొమ్మలు కార్టూన్లు , నాకు గురువులు .
రామశేషు గారు మీతో స్నేహం ఇలాగే కొనసాగాలని, మీరు నవ్వుతు , మీ కార్టూన్లతో నవ్విస్తూ, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని , ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను .
5, మే 2015, మంగళవారం
మొట్ట మొదటి కారికేచర్
హాస్యానందం మాస పత్రిక సంపాదకులు శ్రీ రాము గారి ప్రోత్సాహంతో నేను వేసిన మొట్ట మొదటి కారికేచర్ .
సిని నటులు శ్రీ ఎల్ . బి . శ్రీరాం గారు , వెర్రి నాగాన్నతో .......... హాస్యానందం మాస పత్రిక మే నెల ఎల్ . బి . శ్రీ రామ్ గారి ప్రత్యేక సంచికలో
సిని నటులు శ్రీ ఎల్ . బి . శ్రీరాం గారు , వెర్రి నాగాన్నతో .......... హాస్యానందం మాస పత్రిక మే నెల ఎల్ . బి . శ్రీ రామ్ గారి ప్రత్యేక సంచికలో
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjo9pLFWMZ0IfJZ9IJ3Z7O7qf0BQHjMTVO9Hs_L6m3s5l8Xc0cxr3OqgWg7kJfaQwsxTKdgge766KXO3qVOmmKdv0Lf8PcRWlVn0mxqKxTnimdcmMeWcByS_glHJUi2oknrI6cMPm047A/s320/inner-pages-38.jpg)
తొలి తెలుగు కార్టూనిస్టు శ్రీ తలిశెట్టి రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని , హాస్యానందం మాస పత్రిక నిర్వహించిన కార్టూన్ పోటిలో విశిష్ట బహుమతి పొందిన నా కార్టూన్ .
న్యాయ నిర్ణేతలు సిని నటులు శ్రీ తనికెళ్ళ భరణి , సిని దర్శకులు శ్రీ జనార్ధన మహర్షి గార్లకు , హాస్యానందం మాస పత్రిక సంపాదకులకు , పోటి నిర్వాహకులకు నా హృదయ పూర్వక ధన్యవాదములు . నా తోటి విజేతలందరికి
శుభాకాంక్షలు , బాపు రమణ అవార్డు విజేత శ్రీ బాచి గారికి ప్రత్యేక అభినందనలు .

![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjUrRs-Cf_0MyWingpSg-IUIvDYG1vkJj5tsivTfiKmstVLZACSVu_GGr8XUIbHAfQpKTe5i3nCwsj_vpJ631nzeRmPErn4Vp_TyJS7vg3MsGns07D-PlVibPCL4iDtUy-IybniXkWanA/s320/55.jpg)
26, ఏప్రిల్ 2015, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)