29, డిసెంబర్ 2014, సోమవారం

నాలోన గలశివుడు నీలోన గలశివుడు నాటకాలాడగలడు


       

       
          ఎన్నో రోజులుగా మా ఆవిడ కోరుతున్న కోరిక , ఒక్క సారి వేములవాడ దేవస్థానం వెల్లివద్దమండి , చాలా రోజుల క్రితం ఏదో మొక్కుకుందట , అది తీర్చాలట , ఆవిడకి దేవుడిపైన చాలా నమ్మకం , నమ్మకమే కదండీ మనిషిని ముందుకి నడిపిస్తుంది , ప్రతివ్యక్తికి ఏదో ఒక దానిపైన నమ్మకం ఉంటుంది, అది దేవుడా,తాను చేస్తున్న పనా , తన పైన తనకా  ఏదైనా కానియండి , నమ్మకం మాత్రం నిజం . అదే ఈ  సృష్టికి ఆధారం .

        ఇదంతా సోది ఎందుకుగాని అసలువిశయానికి వద్దాం , అది కార్తీక మాసం కావడంచేత శివాలయాలలో విపరీతమైన రద్దీ ఉంటుంది  అంచేత సూర్యోదయానికి ముందే వేములవాడ చేరుకునేలా ప్రయాణమై వెళ్ళాం .

        బస్సుప్రయానం , అక్కడికి చేరుకునే సరికి ఉదయం ఎనిమిది దాటింది , దిగంగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా , ఆలయం పడమటి ద్వారం గుండా దేవస్థానం లోకి ప్రవేశించాం , ప్రవేశిస్తూనే దేవస్థానం వారు ఏర్పాటుచేసిన మైకుల్లో తనికెళ్ళ భరణి గారు రచించి గానం చేసిన శివతత్వాలు వినిపిస్తున్నాయ్ , ఆవెంటనే ఆలయానికి సంబందించిన సూచనలు చేస్తున్నారు.

       ఆలయానికి కుడివైపున ఉన్న " ధర్మగుండం "  {కోనేరు } లో స్నానం చేయడానికి ఉపక్రమించాం , అదే వైపున పెద్ద చెరువు, చాల శుద్దిగా ఉంది నీరు దాంట్లో బోటింగ్ కూడా ఏర్పాటు చేసారు, మైకులో ....... నాలోన గలడు శివుడు నీలోన గలడు శివుడు ..... నాలోన గలశివుడు నీలోన గలశివుడు గంగ తలకేత్తగలడు ................

      భక్తులకు విజ్ఞప్తి ధర్మగుండంలో కొబ్బరికాయలు కొట్టకూడదు , రూపాయి నాణాలు వేయకూడదు , సబ్బులు వాడకూడదు , ఆలయ పారిశుద్యానికి సహకరించండి,    అనౌన్సు మెంటు  వినిపిస్తోంది , నిజమే కదండీ , మనం విచక్షణతో ఉండకపోతే  పారిశుద్యం ఎలా సాధ్యం , అసలు ఇలాంటివన్నీ ఒకరు సూచిస్తేనే మనం చెయాల , పౌరులుగా  పారిశుద్యం పాటించడం మన భాధ్యత కాదా? పోనిలెండి , వారుసూచించిన విధంగా  మేము మా స్నానాలు ముగించుకుని , తడిగుడ్డలతో దర్శనం కోసం లైన్ లో నిలబడటానికి పరుగులు తీస్తున్నాం , రద్దీ చాలా ఎక్కువగా ఉంది , దర్మగుండానికి ఆనుకుని కల్యాణకట్ట , దాన్ని ఆనుకుని కళ్యాణమండపం , దానికి ఎదురుగా బెల్లం అమ్మకాలు సాగుతున్నాయి , కోరికలు తీరిన భక్తులు మొక్కిన మొక్కుబడిని బట్టి బెల్లం తూకం వేయించి ప్రసాదంగా పంచుతుంటారు, బెల్లం పంచుతున్న వారిని తదేకంగా చూస్తున్న నన్ను  'ఎంటండి మీరు దిక్కులు చూస్తూ నిలబడ్డారు , త్వరగా నడవండి ప్రత్యేక దర్శనం టిక్కెట్ తీసుకురండి , ధర్మదర్శనం లైన్ లో నిలబడ్డ మంటే   ఇక ఇంత రద్దీ లో మన దర్శనం ఇవాళ ఐనట్టే , ఊ  త్వరగా నడవండి ...... నన్ను తొందర చేసింది నా శ్రీమతి .

       భక్తుల సౌకర్యమ్ కోసం మూడు క్యూ  లైన్ లు ఏర్పాటుచేశారు . ధర్మదర్శనం , ప్రత్యేక దర్శనం , కోడె మోక్కుల దర్శనం ,  ఈ మూడు వరసలు సమాంతరంగా వెళ్తూ ఆలయ గాలిగోపురం దగ్గర కలుస్తాయి ,
ఇక్కడ కోడె మోక్కులు ప్రత్యేకం, తమకోర్కెలు తీరితే కోడె ను{ఎద్దు } కట్టేస్తాం అని మొక్కుకున్న భక్తులు
ఆలయం వారు ఏర్పాటు చేసిన కోడెలను తీసుకుని గర్బగుడి చుట్టూ ప్రదక్షినగా తీసుకువచ్చి , గర్బ గుడికి ఎదురుగా కట్టేస్తారు, దీనికి గాను కొంత రుసుం కట్టాల్సి ఉంటుంది, ఇది వేములవాడ రాజరాజేశ్వరస్వామికి ప్రత్యేకం.

        రెండు ప్రత్యేక దర్శనం టిక్కెట్ లు తీసుకుని శ్రీమతి నేను వరసలోకి ప్రవేశించాం , హరహర మహాదేవ ..... హరహర మహాదేవ ................ భక్తుల హర్శద్వానాలతో వరసలన్ని హోరెత్తి పోతున్నాయి , హమ్మయ్య లైన్లో నిలబడేదాకా మనసు కుదుట పడలేదు , వరసలన్ని భక్తులతో కిట కిట లాడుతున్నై , మా పక్క వరస కాళిగా ఉంది , అది ధర్మ దర్శనం లైన్ ,  ప్రతి ఒక్కరు తొందరగా దర్శనం చేసుకుందాం అనే తొందరలో డబ్బులు కట్టి లైన్లో  నిలబడ్డవారే , దాంతో ధర్మదర్శనం లైనంతా ఖాళీగా ఉంది ,  మాయావిడకి చూపించాను  అయ్యో ముందే అనుకుంటే ఆ లైన్లోనే వెళ్ళేవాళ్ళం కదండీ అంది నాలిక్కరుచుకుంటూ ...................,

        మైకులో భరణిగారి శివతత్వాలు వినిపిస్తున్నాయ్ ......... నాలోన శివుడు గలడు ........ నీలోన శివుడు గలడు ..................  నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపైనున్డగలడు  .................. ,     భక్తులకు విజ్ఞప్తి , క్యు లైన్లో ఉన్న వారు సంయమనం పాటించగలరు , తోపులాటలు వద్దు , రద్దీ ఎక్కువగా ఉంది గమనించ ప్రార్థన,
మా పక్క వరసలో ఒక జంట చిన్న పాపను ఎత్తుకుని నించున్నారు , మూడు సంవత్సరాలు వరకు ఉంటాయ్ పాపకు, ఒకటే ఏడుపు , పుట్టు వెంట్రుకలు తీయించి నట్లున్నారు , కోడె మోక్కుల లైన్లో నించున్నారు , పాప ఏడుపు వాళ్లకు ఎం తోచకుండా ఉంది , లైనువిదిచిపొరాదు ,కొత్త గుండుతో ఉన్న పాప ఏడుపు ఆపదు , ఎంత ఊరడించినా వినడంలేదు , వారినిచూసి మాయావిడ విలవిల్లాడి పోయింది , కొంచెంసేపు పాపను తీసుకుని ఆడించినా ఫలితంలేదు .  పాపతండ్రి చిరాకు పడిపోతున్నాడు,  అటు ఇటు గా  గాలిగోపురం దగ్గరిదాకా వచ్చాం , ఇక్కడి నుండి అన్ని లైన్లో వాళ్ళు ఏకమై గర్బగుడి ద్వారంలోకి ప్రవేశిస్తారు .

        ఆలయ గోపురం దాటగానే గర్భగుడికి ఎడమవైపున , హజ్రత్ బాబా సమాది  ద్వజ స్థంబం పక్కనే ఊదు  పొగ పట్టించుకుంటూ , తావీజులు కట్టించు కుంటున్న భక్తులు .......................,  హజ్రత్ బాబా గొప్ప శివ భక్తుదంట , ఆయన జ్ఞాపకార్థం  సమాదిని గర్భగుడి ముందరే ఏర్పాటు చేసారు . ఎంత గొప్ప మత సామరస్యం మనది , జైహో భారత్ .

       దర్శనం త్వరగా అవుతుందిరా మహాదేవా అనుకుంటూనే ఉన్నాం గాని , గంట సేపు , రెండు గంటల సేపు , లైను కదలదె , ఎక్కడివారం అక్కడే ఆగిపోయాం, లైను ఒక్క ఇంచుకూడా కదలడం లేదు . ఏమై ఉంటుందా ............ ,   పక్క లైన్లో పాప ఏడుపు ఆపడంలేదు, లైను కదలడంలేదు , గంటలకొద్దీ నిలబడి కాళ్ళు లాగుతున్నాయ్ , ఓపిక నశిస్తోంది , ఏడుస్తున్న పాప తండ్రికి ఓపిక నశిన్చిందేమో , అక్కడ కాపలాగున్న కానిస్టే బుల్  ని పిలిచి విషయం ఆరా తీసాడు, ఆలయ e.o. ప్రత్యేక పూజలు చేయిస్తున్నదంట , అందుకే ఈ ఆలస్యం .

       "ఏమైనా అంటే అన్నమంటారుగాని  భక్తుల సౌకర్యాలు చూడాల్సిన e.o. గారే భక్తుల అసౌకర్యానికి  కారణమైతే  ఎంటండి దానర్థం , బుద్ది జ్ఞానం ఉండక్కర్లేదా ....... అసలు వాడు మనిషేనా .......... @@@@@@ $$$$$$$ %%%%%%% ######### &&&&&&&  మాటల్లో చేపడానికి వీలుకావడం లేదు అందుకే పై గుర్తులు వాడాను , అంత విపరీతంగా తిట్టాడండి  ఆపాప తండ్రి . తన ఆవేదనంత ఆ తిట్లల్లో వెళ్ళగక్కాడు,  అంతలో అటుగా ఆలయ ప్రదక్షణ చేస్తూ  వస్తున్న e.o. ఈ గొడవ వింటూ అక్కడ ఆగాడు, కాపలాగున్న కానిస్టేబుల్ ని పిలుచుకుని విషయం ఆరాతీస్తున్నాడు ..................... మైకులో .................. నాలోన శివుడు గలడు  ...........................నీలోన శివుడు గలడు ....................నాలోన గల శివుడు నీలోన గలశివుడు   ఒక కంట చూడగలడు .......................  భక్తుల అసౌకర్యానికి చింతిస్తున్నాం ................................................ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, !!!!!

          మెల్లగా క్యు లైను కదలడం మొదలైంది , ధర్మదర్శనం లైను, ప్రత్యేక దర్శనం లైను రెండు లోపలి వదిలాడు కానిస్టేబుల్ , కోడె మొక్కుల లైను ఆపేసాడు, మేము లోపలి కదులుతున్నాం , ఆ పాప ఏడుపు రెట్టింపు చేసింది , ఆ పాప తండ్రి  కళ్ళల్లో రక్తాలు కనిపిస్తున్నాయ్ , e.o. కి కానిస్టేబుల్ కి మద్య ఏదో సంబాషణ జరిగింది , దాని పర్యావసానమే  కోడె మొక్కుల క్యు లైను ఆగిపోవడం ,    మైకులో ............................................   నాలోన శివుడు గలడు  ..............................  నీలోన శివుడు గలడు ....................  నాలోన గలశివుడు  నీలోన గలశివుడు   నాటకాలాడగలడు ...................................

      పాప ఏడుపు నాకు ఇంకా విన బడుతూనే ఉంది ..................................., ఆ సంగటన నన్ను  లోపలినుండి కేలుకుతూనే ఉంది .....................


గాంధి గారి మార్గం



27, డిసెంబర్ 2014, శనివారం

ఇవి 2014 సంవత్సరంలో బహుమతులు పొందిన నా కార్టూన్లు





ఇవి  2014 సంవత్సరంలో బహుమతులు పొందిన నా కార్టూన్లు , వీటితో పాటు మరికొన్ని కార్టూన్లు ప్రముఖుల ప్రశంశలు, కార్టూన్ ఇష్టుల అభిమానం చూరగోన్నవి కూడా ఉన్నాయి, మొత్తానికి 2014 సంవత్సరం నాకు విజయాలను, విమర్శలను, ఆనందాన్ని , ఆలోచనలను, అనుభవాలను, గురుదేవుల ఆశీర్వాదాన్ని, మిత్రుల ప్రోత్సాహాన్ని, కొంత గందరగోలాన్ని  మిగిల్చింది .  శుభం భూయాత్ ! 



23, డిసెంబర్ 2014, మంగళవారం

పారిశ్రామికీకరణ



నగరం నాగరికునికి  కాలుష్యాన్ని  అలవాటు చేసింది,  మనిషిని  సహజత్వానికి, ప్రకృతికి దూరం  చేసింది, పారిశ్రామికీకరణ మత్తులో మనిషి మునిగిపోయాడు, ఇప్పుడు పరిశ్రమలనుండి వెలువడిందే స్వచ్చం , శ్రేష్టం, ఆరోగ్యకరంగా గుర్తింపబడుతోంది . 

14, డిసెంబర్ 2014, ఆదివారం

courtesy; www.teluguvennela.com సదాశివ్ తన తండ్రిగారి పిండప్రదానం ,పూజాది కార్యక్రమాలు నిర్వహించి పక్షికోసం ఎదురు చూస్తున్నాడు ............., కుటుంబ సబ్యులంత నది గట్టున ఒక వైపున పిండం వదిలి మరోవైపున నిలబడ్డారు , నదిగట్టున కొంతదూరం వరకు ఒక్క చేట్టుకూడా లేదు ఎక్కడో దూరాన ఒక్క తుమ్మ చెట్టు తప్ప . సూరీడు తూరుపు వదిలి నడి నెత్తిన నిలబడ్డాడు , అందరి తలలు మాడుతున్నాయ్ , కాళ్ళు లాగుతున్నాయ్ , కడుపులు చుర చుర లాడుతున్నాయ్ , ఒక్క పక్షి రాలేదు , పిండం ముట్టలేదు, సదాశివ్ తో సహా కుటుంబ సభ్యులన్దరిలో ఆందోళన మొదలైంది , ఎం చేయాలో తోచడం లేదు , అందరు ఒక్కొక్కరుగా వచ్చి పిండపదార్థం ముందు నిలబడి తప్పులుంటే క్షమించమని , ఏదైనా తక్కువ చేసామాని , ఇంకెవరైనా రావాలా ని , అలకవీడి పిండం ముట్టమని , వేడుకోవడం మొదలుపెట్టారు, సదాశివ్ భార్య ఒక్కసారిగా ఏడుపు అందుకుంది, మా తప్పులేవైన ఉంటె పెద్దమనసుతో క్షమించమని , మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని పూజిస్తామని వేడుకుంది . ఇదంతా దూరాన ఉన్న తుమ్మచెట్టు పైన వాలిన కాకుల జంట గమనిస్తుంది , చూసావా బావా ఈ మాత్రం ఎండా , ఆకలిబాధకే ఎంత విలవిల్లడిపోతున్నారో ............, చనిపోయిన పెద్దాయన నాకు తెలుసులేవే , ఆయన ఉండే వ్రిద్దాశ్రమమ్ లో ఒక చెట్టుపైన నేను కొన్నాళ్ళు కాపరం ఉన్నాను . ఆ చెట్టు క్రింద స్నేహితులతో కూర్చుని , అమెరికాలో కొడుకు, ఇక్కడేమోతను , ఎవరులేనివాడిలాగా ఎంతవేదనపడేవాడో , ఎన్ని నిద్రలేనిరాత్రులు గడిపాడో, ఎన్ని రోజులు తిండి తినకుండా బాధపడ్డాడో , బ్రతికుండగా ఒక్కనాడన్నా కొడుకు చూడడానికి వచ్చిన పాపాన పోలేదు , ఫోనులో నైన పలకరించిన వాడుకాదు , ఇప్పుడేమో గుండెల్లో పెట్టుకు పూజిస్తడట్ట, ఛి ఛి !!! ఇలాంటి వాడు పెట్టిన పిండం ముడితే మనకు పాపం చుట్టుకుంటుంది , పదవె పోదాం ఈ మాత్రమైన వాడు బాధ పడకపోతే ఆ ముసలాయన ఆత్మకి శాంతి ఉండదు . ఆత్మ రూపంలో కాకులజంట పక్కనే కూర్చుని ఉన్న సదాశివ్ తండ్రి వాటి సంభాషనంత వింటున్నాడు , కాకుల ఆలోచన ఈ రకంగా ఉంటె ఆత్మ రూపంలో ఉన్న పెద్దాయన ఆలోచన మరోరకంగా ఉంది , ఎంత చెడ్డ................, వాడు నా కొడుకు , ఎ పరిస్థితులలో వాడు నన్ను వ్రిద్ధశ్రమం లో ఉంచాల్సి వచ్చిందో , అమెరికాలో వాడికే తీరిక ఉండదు , కోడలు కూడా ఉద్యోగినే కదా , వారిరువురు వాళ్ళ పనుల్లో మునిగిపోతే ఇక నన్ను చూసుకునేది ఎవరు , అందుకే విధి లేక నన్ను వ్రిద్దశ్రమంలో చేర్పించాడు, అది తెలుసుకోలేక నేనే అనవసరంగా బాధ పడ్డాను , అయినా వాడు అమెరికాలో ఉద్యోగం చేయాలి , గొప్పవాడు కావాలి అని కలలు గని చదివించింది నేను కాదా ? ఇల్లు కుదవ పెట్టి ఇంజనీరింగ్ చదివించింది నేను కాదా ......, అమెరికాలో ఉద్యోగం దొరికితే , కనిపించిన వారికల్ల చెప్పుకుని ఆనందపడింది నేను కాదా ? మరి వాడి తప్పు ఏమిటి , ఇప్పుడుకూడా వాడు బాధ పడకూడదు , అనుకుంటుండగా ................ ఇందాక చీదరించుకున్న కాకము తిరిగి వెళ్ళిపోతుంది ............ మరో కాకము చేట్టుపైనే ఉంది ఎగిరిపోతున్న కాకి సర్రున తిరిగి వెళ్ళి పిందపదార్థము పైన వాలింది ......................... చెట్టు పైన కూర్చున్న కాకి తలపంకించి ఆశ్చర్యంతో పిండంపైన వాలిన కాకినే చూస్తుండి పోయింది ................... కాకిలో దూరిన సదాశివ్ తండ్రిగారి ఆత్మ కడుపారా పిండ పదార్థాన్ని ఆరగించి, కొడుకుని మనసారా ఆశీర్వదించింది .

                       

                    

13, డిసెంబర్ 2014, శనివారం

ఓదార్చే బాధ్యత నీదే .


            విరహంతో తడిపి 
            పోస్ట్ చేసిన నీ మనసుని చదివాను 
            అక్షరాలనిండా నువ్వే 

             నిన్ను చూసి 
             నీరై కారుతున్న 
             నా మనసుని  బదులు 
             పంపుతున్నాను 

             ఓదార్చే బాధ్యత  నీదే . 

వరకట్నం



12, డిసెంబర్ 2014, శుక్రవారం

1, డిసెంబర్ 2014, సోమవారం

అంతర్జాల పత్రికల్లో ప్రచురితం అయిన నా మొట్టమొదటి కార్టూన్ ఇది


     ఇప్పటివరకు నేను కార్టూన్ కథ వ్రాయలేదు  కాని కార్టూన్ స్ట్రిప్ వేసాను ,  ఇది నవంబర్ , 2011 ,   www.64kalalu.com , వెబ్ మాగజిన్ లో ప్రచురితం అయింది .
 
     అంతర్జాల పత్రికల్లో ప్రచురితం అయిన నా మొట్టమొదటి కార్టూన్ ఇది ,  అడపా దడపా కార్టూన్లు వేసే నన్ను వెన్నుతట్టి , రెగ్యులర్ గా కార్టూన్లు వేయమని, 64కళలు . కొం .  మాసపత్రికకి కార్టూన్లు పంపితే తప్పకుండా ప్రచురిస్తానని , ఎంతగానో ప్రోత్సాహాన్ని అందించిన కళాసాగర్. యెల్లపు గారికి ధన్యవాదములు,  ఆయన ప్రోత్సాహం మరువలేనిది . ఒక శుభోదయాన ఆయన కార్టూన్ల పుస్తకం నాకు బహుమతిగా అందించారు , ఆ రోజును నేను ఎప్పటికి మరువలేను,  నేను ఎంతో ఆనందించిన రోజు అది . థాంక్యు  కళాసాగర్ సర్ ...... థాంక్యు వేరి మచ్ . 

27, నవంబర్ 2014, గురువారం

విచక్షణతో



www.gotelugu.com  అంతర్జాల వార పత్రికలో ప్రచురితం ఐనది ,   ఏదైనా ఒక విషయం కాని, వస్తువు గాని, సంఘటన గాని , వ్యక్తులు గాని, వాటిని మనం చూసి ఆకళింపు చేసుకునే దాన్ని బట్టి మనకు అది గోచరిస్తుంది,
నిజానికి అక్కడ జరిగింది ఒకరకంగా ఉంటె మనం మరో రకంగా  అర్థం చేసుకుని పొరపడే అవకాశం ఉంటుంది.

  ఇక్కడ చిత్రకారుడేమో  చిత్రం  పిల్లలవల్ల  పాడైపాయిందని బాద పడుతుంటే,
మరో అతను పటము పైనున్న రంగులని చూసి మురిసి ,  అద్బుతంగా ఉందని ఆనందిస్తున్నాడు,  ఈ విదంగానే మనము కూడా ఎన్నో విషయాలలో పోరపడుతున్టాము, ఒక్కో సారి మంచిగాను , చేడుగాను .  కాబట్టి విచక్షణతో కూడిన అంచనా మంచిదంటాను , ఏమంటారు ?

24, నవంబర్ 2014, సోమవారం

మహిళా శిరోమణులకుజోహార్లు . ...................

'షాడో'  అనే అంశం మీద జరిగిన ఒక పోటికి నేను పంపిన కార్టూన్ ఇది,  ఎంపిక కాలేదు .

సమాజంలో ఉన్నతంగా ఎదగాలని ఆశ పడే ఆడవారిని , ఎదుగుతున్న వారిని , ఓర్వలేని సమాజం , మారుతున్న సాజిక పరిస్థితులకి అనుగుణంగా వస్త్రధారణలు , వేష భాషలు, మార్చుకునే వారిపట్ల ఏవగింపు ప్రదర్శించే సమాజం , వారి ప్రతి అడుగుని వ్యతిరేకిస్తుంది , ఏవేవో హద్దులు నియమిస్తుంది ,  ఆఖరికి వారి నీడను కూడా
 మార్చే ప్రయత్నం చేస్తుంది .  అలాంటి పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగిపోతున్న మహిళా శిరోమణులకుజోహార్లు . ...................   

15, నవంబర్ 2014, శనివారం

గండం గడవలేదు

                                                               గండం గడవలేదు



            ఏయ్  ఆటో నేను చెప్పిన అడ్రస్ ఏంటి నువ్వు తీసుకేల్తున్నదేటు ....................
ఏయ్ పోరి మాట్లాడకుంట నోర్ముసుకుని కూసో , నేన్ తీస్కుపోయినదిక్కు సూడు ..., చల్ ,  అరిచాడు.
            ఏం జరగబోతుందో అప్పుడర్థమైంది ,  గుండె దడ పెరిగింది ..................,
రాత్రి తొమ్మిది దాటే వరకు షాపింగ్ చేసి వంటరిగా ........................,   షిట్ .॥॥
షాపింగ్ మాల్ దగ్గర పక్కింట్ పొకిరివెధవ రాజుగాడు లిఫ్ట్ ఇస్తానంటే వాడి వంకర బుద్ధి నచ్చక తిరస్కరించి, చక్కగా వచ్చి పులిబోనులో చిక్కినట్లైంది .  అయ్యో ....... అయ్యో ............!!!!!
     ఒంట్లో వణుకు మొదలైంది , నన్ను నేనే కాపాడు కోవాలి , గట్టిగా గుండెలనిండా గాలి పీల్చుకుని తక్షణ కర్తవ్యం ........... ఎలా ...... ఎలా .........!!!!!!
      క్రమంగా ఆటో జనావాసాలకు దూరంగా వెళ్తోంది , ఆటో వాడు వేగం పెంచాడు ....... ఏ క్షణమైనా నన్ను ..... వాడు .......
      ఇక ఆలోచించి లాభంలేదు , షాప్ లో కూరగాయలు కోయడానికని కొన్న కత్తి  బాగులోంచి టక్కున తీసి వాడి వీపుకి ఆన్చి పట్టుకున్న ..............,
      ఒరేయ్ మర్యాదగా ఆటో వెనక్కి తిప్పి నేను చెప్పిన దిక్కు వేల్లకపోయావో .............. గట్టిగా అరిచినంత పనిచేసాను .......... వాడు బెదరలేదు,     ఏయ్ చొక్రి బయపడతాననుకున్నావా ...... అయిసా మై బహుత్ దేఖా ........ గొంతు పెంచాడు .
      కత్తి చేతులోకి రాగానే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో , వాడి మాటలు పట్టించు కోకుండా కత్తి ని కాస్త గట్టిగా వాడి వీపుకి వత్తి పట్టుకుని ఆటో తిప్పుతావా లేదా ...... అరిచాను .
     కత్తి వాడి వీపులోకి గుచుకున్నట్లుంది చొక్కా చిరిగి రక్తం బోట బొటా .... కారడం మొదలైంది .
అబ్బా .......!!!!! ఒక్కసారిగా అరిచాడు .  మూ ..... ఆటో తిప్పు ......... నేను తగ్గలేదు .
    భయం నా నుండి వాడికి బదిలీ అయింది .......,
ఆటోని నేను చెప్పిన దారిలోకి మళ్ళించాడు
గుండెల్లోంచి తన్నుకొస్తున్న వణుకుని పంటికింద వత్తి పట్టుకుని  ఆటోవాన్ని , రోడ్డుని జాగర్తగా గమనిస్తున్నాను .
ఆటో మా ఇంటి రోడ్డుకి దగ్గరౌతుంది ........... అప్పుడు లిఫ్ట్ ఇస్తానన్న రాజుగాడు....... అవును వాడే అటువైపే వెళ్తున్నాడు ,   క్షణం కూడా ఆలోచించకుండా ............... రాజూ ............... అరిచాను . నా గొంతువినగానే  రాజు బండి ఆపి ఆటోకేసి చూసాడు .
       ఆపరా ....... ఆటోవాడికేసి చూస్తూ అన్నాను .....  ఆటో కాస్త నెమ్మదించగానె , ఒక్క అంగలో ఆటో దూకి వెళ్లి రాజు బైక్ పైనెక్కి కూర్చున్నాను క్షణాల్లో .....................
       ఆటో వాడు అక్కడినుండి వేగంగా కనుమరుగయ్యాడు ................
బైక్ ముందుకు కదిలింది .................. ఇంటికేనా ?............................ ఏం జరిగింది ?.......................
అకస్మాతుగా  అటో దిగి వాడి బైక్ పైన కూర్చున్న నన్ను కాస్త అనుమానంగా , ఆశ్చర్యంగా , అడుగుతున్నాడు ..........................
     అప్పటిదాకా గుండెల్లో అదిమి పట్టుకున్న దుఃఖం కళ్ళ నుండి తన్నుకొస్తుంది ......... ఆపుకోలేక పోతున్న ................................................ వాడు మాట్లాడుతున్నాడు , నాకు ఏమి విన్పించడం లేదు .......... భయం నా చెవిలో హూంకరిస్తోంది ........................... గండం గడవలేదు ...............!!!!!!!!
     రాజు ఒక మగాడే కద . 

12, నవంబర్ 2014, బుధవారం

పత్రికల్లో అచ్చైన నా మొట్ట మొదటి కార్టూన్ ఇది .



     పత్రికల్లో  అచ్చైన  నా మొట్ట మొదటి కార్టూన్ ఇది .

1998 లో నేను డిగ్రీ చదివే రోజుల్లో నా ప్రియ మిత్రుడు ప్రభాకర్ రెడ్డి యేలేటి  ఈనాడు పత్రికలో లేఖలు , వ్యాసాలూ వ్రాసేవాడు ,  కార్టూన్స్ గూర్చి ముందుగా తెలిసింది అతని  ద్వారానే, నాకు బొమ్మలు వేయడం వచ్చునని తెలుసుకుని కార్టూన్స్ గీయమని ప్రోత్సహించే వాడు,  కాని నేను పంపిన కార్టూన్స్ ఏవికూడా ప్రచురణకి ఎంపిక కాలేదు,  ఆ రోజుల్లో "శంకర్ శ్రీగద్దె  కార్టూనిస్టు" గారు ఆంధ్రభూమి వారపత్రికలో విరివిగా కార్టూన్స్ వేసేవారు,    ఒక రోజు ప్రభాకర్ రెడ్డి ,  శంకర్ శ్రీగద్దె గారితో పరిచయం చేసాడు,  ఆ రోజు కార్టూన్స్ ఎలా వేయాలి , ఎ సైజు , పంపే విదానం , అన్ని విషయాలు శంకర్ శ్రీగద్దె  గారు నాకు వివరంగా తెలియజేయడం  జరిగింది.
 
     డిగ్రీ తో నా చదువు ఆపేయడం , వ్యాపారంలో తలమునకలవడం , కార్టూన్ లని మరచి పోవడం  జరిగింది .

తరువాత  నా మిత్రుడు ప్రభాకర్ రెడ్డి యేలేటి  ఈనాడు దిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్గా ఉద్యోగం లో స్థిరపడి, కొన్నాళ్ళకు మేము కలసి నపుడు కార్టూన్ల ప్రస్థావన తేవడం జరిగింది ,  మళ్ళి నా మనసు కార్టూన్ల వైపు మళ్ళింది .

    ఇక ఈ కార్టూన్  అచ్చు కావడానికి శంకర్ శ్రీగద్దె గారి సలహాలు ఎంతో ఉపయోగ పడ్డాయి , తరువాత  విజయ్ కార్టూనిస్ట్ గారు , వినోద్ కార్టూనిస్ట్ గారు , వడ్డేపల్లి వెంకటేష్ గారు, రామ్మోహన్ గారు, కందికట్ల s . v . గారు , అర్జున్ కార్టూనిస్ట్ గార్లు  ఎన్నో విలువైన సలహాలు , పత్రికల చిరునామలు  తెలియపరచి నేను కార్టూన్స్ వేయడానికి ఎంతో సహకరిస్తున్నారు .

   ఇప్పుడు  గురుదేవులు జయదేవ్ గారి అమూల్యమైన సూచనలతో , ప్రతి విషయం పైన ఆయన ఏర్పరుస్తున్న అవగాహనతో , ముందుకు సాగుతున్నాను .  గురుబ్యోనమః

   మిత్రులు , వెల్ విషర్ రామశేషు గారు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు .

మన కార్టూనిస్టు మిత్రులలో ఉన్నంత ఆహ్లాద కర వాతావరణం , స్నేహ భావం , పరస్పర సహకారం , ఏ ఇతర రంగాలలో ఉండదు కాబోలు . జైహొ కార్టూన్లు, జైహొ కార్టూనిస్టులు .

 నా కార్టూనిస్టు మిత్రులు , గురువులు  అందరికి శత కోటి హ్రిదయపూర్వక  ధన్యవాదములు .
తెలుగు కార్టూనిస్టు లందరికి అనంత కోటి వందనములు .
     

4, నవంబర్ 2014, మంగళవారం

అదేచూపు …

                                    బురఖా ధరించిన ఒక అమ్మాయి పొద్దున్నే వచ్చింది మా  షాపులోకి , నావైపు ఒక్క క్షణం ఓరగా చూసింది , “మీకు వచ్చే కొలతలతో ఒక షర్ట్  కావాలండి”  అడిగింది . “అదికూడ మీకు బాగా నచ్చిన , మీ షాప్ లోనే ఖరీదైన ,నాణ్యమైనది ” కావాలి .  చెబుతున్నంత సేపు నన్నే అదోలా చూస్తుంది ,ముఖం మొత్తం కప్పి ఉన్నా కళ్ళల్లో భావాలు స్పష్టంగా తెలుస్తున్నాయి .            షాపులో ఉన్న అన్నిరకాల ,నాణ్యమైన షర్ట్స్  తీసి చూపించాను.  కాసేపు చూసి మల్లి నన్నే వాటి లోంచి మంచి నాకు నచ్చిన  నాలుగు చొక్కాలుతీయమని , వాటన్నిటిని వేసుకుని చూడమంది  కాస్త అధికారికంగా .  ఈ సారికాస్త  కంగారు పడ్డాను.            నాకు బాగా నచ్చిన  ఒక చొక్కా ఎంపిక చేసుకుని , బేరం ఆడకుండానేను ఎంత చెబితే అంత నా చేతిలో పెట్టి,   “బాయ్”…………………...,  అంటూ మల్లి ఒక్క సారి ఓరగా చూసింది .  ఈ సారి ఆవిడ చూపు నా ఆలోచనల్నిఆవిడ చుట్టూ తిరిగేలా చేసింది .  ఇక ఆ రోజంత నేను నేనుగా లేను , ఆవిడాఎందుకలా చూసింది , నా సైజు చొక్కా ఎందుకు తీసుకుంది , ఎందుకు నన్నువేసుకుని చూడమంది ,  ఇదివర  కెప్పుడు షాపులో ఇలాంటి సంగటన జరగ లేదు .         భోం చేస్తున్నాను , మా ఆవిడ ఏదో చెబుతుంది , నా కేమి వినిపించడంలేదు, బురఖ స్త్రీ గురించే ఆలోచన  ……………………….ఆలోచిస్తూనే ఉన్న ఎప్పుడుపడుకున్ననో .          ఏమండి ….. ఏమండి ………………………., మా ఆవిడనన్ను కుదుపుతూ లేపింది,”అబ్బ ఎంటే అర్దరాత్రి నీ గోల ”                     ఒక్క క్షణం లేచి అలాగే కూర్చోండి,  అంటూ  వెళ్లిగదిలోనుండి అందంగా  అలంకరించిన ఒక అట్ట పెట్టె  తెచ్చి నా చేతిలో పెట్టి,  “పతిదేవులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ”  అంది ఆహ్లాదంగా నవ్వుతు………….. ,           ఒక్కసారిగా నా నిద్రమత్తు వదిలి పోయి , ఆనందం తో  ఉబ్బిపోయ………………………..,దగ్గరికి పిలుచుకుని నుదుటిపైన ముద్దుపెట్టుకుని , పక్కనేకూర్చోపెట్టుకుని , తను ఇచ్చిన బహుమతి విప్పిచూసా,          ఆశ్చర్యం ………………………… ఈషర్టు,…………………….., నేను,…………………,పొద్దున్న,………………..……….., బురఖా,……………..,స్త్రీ,……………, అంటే,,……………, బురఖాలో……………..,         అవునన్నట్లుగా  ఓరగా చూసింది మా ఆవిడ ……………… అదేచూపు ………………………..అవును అదే చూపు . - See more at: http://teluguvennela.org/ade-choopu/#sthash.jxdbnCvX.dpuf

25, అక్టోబర్ 2014, శనివారం

" యండమూరి వీరేంద్రనాథ్ గారి పుస్తకంలో నా కార్టూన్ "



       
 " యండమూరి వీరేంద్రనాథ్ గారి పుస్తకంలో నా కార్టూన్ "
        నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను ,  తెలుగుపాటకలోకాన్ని ఉర్రుతలూపే ..... అద్బుతమైన చిరస్థాయిగా నిలచిపోయే ఎన్నో గొప్ప రచనలు చేసిన చేస్తున్న , గొప్ప రచయిత .  హాస్యానందం మాస పత్రికలో ప్రచురితం ఐన నా కార్టూన్లలో ఒకటి  ఎంపిక చేసుకుని   "లోయనించి శిఖరానికి " పుస్తకంలో ప్రచురించారు , ఇది నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను . హాస్యానందం పత్రిక సంపాదకులు రాము గారికి , ది గ్రేట్  యండమూరి వీరేంద్ర నాథ్  గారికి  హ్రిదయపూర్వక శతకోటి ధన్యవాదములు  

20, అక్టోబర్ 2014, సోమవారం

బహుమతి పొందిన నా మరో కార్టూన్

హాస్యానందం మాస పత్రిక   నిర్వహించిన quitefun  కాప్షన్ లెస్ compition లో 3rd ప్రైజ్ పొందిన ఈ కార్టూన్ ప్రక్యాత చిత్రకారిణి సువర్ణ భార్గవి గారి కార్టూన్ 1980 లో వేసిన దాన్ని పోలిఉండడం వివాదానికి దారితీసింది ..... ఇది కాపీ అని కొందరు ,కాదు ఒకేరకం ఆలోచనలు , ఒకేరకమైన సబ్జెక్టు తీసుకుంటే కలవడం సహజమని మరికొందరు మిత్రులు , మద్దతు పలకడం , ఇదివరకు ఇలాగే ఎంతోమంది కార్టూనిస్టుల కార్టూన్లు ఒకేరకంగా రావడం జరిగిందని ...... చర్చను ముగించడం జరిగిన్ది. 

5, అక్టోబర్ 2014, ఆదివారం

DUSTBIN , ADICTED

                                              
                           


                                                                                                                                                            5thఅక్టోబర్ 2014, వార్త డైలీ లో ప్రచురింపబడిన  కార్టూన్స్ , మొదటిది నాగరికంగా అత్యంత ఆధునికతను సంతరించుకున్న మానవుడు ,అనాగరికంగా వ్యవహరిస్తూ , అనాలోచితంగా పాలితిన్ వాడకాన్ని విస్తృతంగా పెంచుకుంటూ ......... భూమండలాన్ని ఒక చెత్త బుట్టలా మార్చేస్తున్నాడు . పర్యావరణానికి ఎంతోహాని కలగాజేస్తున్నాడు.                                                                                                                                                           రెండవది , ఒక సామాజిక మాధ్యమానికి బానిసై దాని వెంట తోక ఊపుతూ తిరుగుతున్నాడు.  

GLOBALIZATION

                                                                                                                                                                               గ్లోబలైజేసన్  ..... అక్టోబర్ 2014 హాస్యానందం మాస పత్రిక లో బెస్ట్ కార్టూన్ అఫ్ ది మంత్ గా ఎంపికైన నా కార్టూన్ .  బహుమతి ప్రదాత శ్రీ సత్యనారాయణ గారికి , నా కార్టూన్ని బహుమతికి ఎంపిక చేసిన పత్రిక ఎడిటర్ శ్రీ రాము గారికి నా హ్రిదయపూర్వక ధన్యవాదములు ... రాముగారు గత మూడు సంవత్సరాలుగా నా కార్టూన్లను హాస్యానందం మాస పత్రికలో ప్రచురిస్తూ నన్ను ఎంతో ప్రోత్సహించడమే కాకుండా ...., నేను కోరగానే ,వెర్రి నాగన్న ఫీచర్ కార్టూన్స్ వేయడానికి  అనుమతించారు. నాకంటూ కార్టూనిస్టుగా ఒక ఇమేజ్ ఏర్పడింది అంటే దానికి నిస్సందేహంగా హాస్యానందం రాముగారి ప్రోత్సాహం ఎంతో ఉందని మనస్పూర్తిగా  చెప్పగలను. ఒక నన్నుమాత్రమే కాదు, తెలుగుకార్తూనిస్ట్ లందరినీ తన బుజాల పైన మోయడానికి ,ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హాస్యానందం పత్రికను నడుపుతున్నారు  ది గ్రేట్ రాముగారు, హాట్సాఫ్ రాము సర్, మీకు  రుణపడి ఉంటాను.                      

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

poor people became poor.

ఈనాడు మన దేశ  ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందంటే ........ శ్రమించే వాడు ఒకడైతే ఆ శ్రమ ఫలితాలు  అనుభవించే వాడు  వేరొకడు ఈ అంశం ఆదరంగా నేను వేసినా ఈ కార్టూన్  చూడండి , మహావృక్షం లాంటి మన దేశం ఒక ఆర్ధిక శక్తి అయితే , దాని ఆర్థిక ప్రగతికోసం రెక్కలు ముక్కలు చేసుకుని సరైన కనీస సౌకర్యాలు లేక [కూడు,గుడ్డ,గోదు.], కస్టపడి పనిచేసే బీద వాడు ప్రగతి ఫలితాలు పొందలేని పరిస్థితి .  ఈ దుస్థితికి కారణం  ఎవరు , మనము కాదా ? అధికారులు,నాయకుల పట్ల మన అలసత్వము కాదా ? 

13, సెప్టెంబర్ 2014, శనివారం

save telugu


      మొదట ఈ కార్టూన్  కరీంనగర్ లో జరిగిన ప్రదర్శన నిమిత్తం పంపడం  జరిగిన్ది.......   బొమ్మను ఒక సారి చూడండి .... అక్కడ బోర్డు పైన తెలుగు భాషను రక్షించండి ,  అని ఉన్న మాటలు ఆవిడ అనుకుంటున్నట్లు వ్రాసాను.... అంటే బోర్డు  లేదు ...  కార్టూన్ బాగోలేదని ....., అర్థం పర్థం లేదని అందరు విమర్శించారు.........

      ఈ కార్టూన్ ని ఎంతో ఇష్టపడ్డ నేను ..  వృధా కావద్దని , ఈ కార్టూన్ గూర్చి గురుదేవులు జయదేవ్ సర్ దగ్గర   ప్రస్తావించాను , ఆయన ఎంతో ఓపికగా  ఫోన్ లో  నేను చెప్పినదంతా విని...... తడుముకోకుండా వెంటనే ఒక మార్పు సూచించారు ...... అమ్మాయి వెనకాల బోర్డు పెట్టి ''తెలుగుభాషని రక్షిద్దాం''  అని వ్రాయమన్నారు.            
       మార్పులు చేసి ఆంధ్రప్రదేశ్ మాస పత్రికకి పంపడం అది ప్రచురణకు నోచుకోవడం ......, నేను తెలుగుకార్టూనిస్టులు  ఫేస్బుక్  గ్రూప్ లో పోస్ట్ చేయడం , అది ఎన్నో ప్రశంశలకు  నోచుకోవడం, నాకు ఎంతో
గుర్తింపు రావడం  జరిగింది .

   
       ఈ కార్టూన్ కి ఎంత గుర్తింపు వచిందో , దాని క్రెడిట్ అంత గురువుగాకే చెన్దుథున్ది...... గురుబ్యోనమః
ఈ రోజు గురువుగారి పుట్టిన రోజు ...... ఆయన ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని ఆ శివుడిని ప్రార్థిస్తున్నాను ...... 


6, సెప్టెంబర్ 2014, శనివారం

 వాన                                                               



సవ్వడి లేని సాయంత్రాన 
నాకు నువ్వు నీకు  నేను 
ఉరుకు పరుగున వచ్చే కారు మబ్బులు 
నిశబ్దాన్ని చేదించాయి 

విరహాన్ని ఓపని వాన దేవుడు 
నింగి వీడి నేల చేరాడు 

నీకురుల్లో చిక్కి ఒక్కోచినుకు 
చెక్కిలినిఆని గుండెల్లో పడుతుంటే 
 చలికి  వణికే  నిన్నుచూసి 
వాన జోరు  తగ్గింది 
ఇన్ధ్రధనస్సయ్ నీకు జోహారంది 

నీటి ముద్దవైన నీ మోము పై 
ముత్యమై మెరిసే వాన చినుకు 
నన్ను నీ దాసుణ్ణి చేసింది .......... 

4, సెప్టెంబర్ 2014, గురువారం


అయ్యా  నాలాన్టిదిక్కులేనివాడు  పడుకునే చోటు ఇది  ........................, మీరు మూత్రం పోసే చోటు అది ...
విజ్ఞులు గుర్తించాలి ........ ,   మనం సంగ జీవులం , విచక్షనంతో  మేలగాల్సింది మనమే ......

nagraj cartoonist:                                                   ...

nagraj cartoonist:                                                   ...:                                                                                             భూమి  సూరీడి  చుట్టూ కాదండి , డబ్బు చుట్టూ ...

3, సెప్టెంబర్ 2014, బుధవారం

                                                 

                                          భూమి  సూరీడి  చుట్టూ కాదండి , డబ్బు చుట్టూ తిరుగుతోంది .
 

                                               ఈ కార్టూన్ వార్త డైలీ పేపర్ సండే బూక్లో ప్రచురితం ఐంది . 

31, ఆగస్టు 2014, ఆదివారం

ఈ రోజు నమస్తే తెలంగాణ  పత్రిక [ బతుకమ్మ ] ఆదివారం అనుబందం లో ప్రచురితం ఐన నా కార్టూన్ . 

30, ఆగస్టు 2014, శనివారం

                                                                    జ్ఞాపకాలు



పాతా ఇనప సామాన్లుకొంటాం, రద్దీ పేపర్లు కొంటాం , 
ఏమండి రద్దిపెపర్లు కొనే అబ్బాయ్ వచ్చాడు.......  అటక పైన రద్దిపపెర్ ,మీ అమ్మగారి ఇనప్పెట్టె ,ఏ ఉపయోగంలేకుండా .., చాలారోజులనుండి పడిఉన్నాయ్ , ఎంతో కొంతకి మాట్లాడి వాడికి ఇచ్చేయండి. 

 అటకపైనుండి  ఇనప్పెట్టె కిందికి దించే టపుడు పట్టు తప్పి కిందపడింది ,  విదిపొఇ అందులోని సామానులన్ని బయటికి విసిరిపడ్డై................ చూదునుకద.........,   నేను హైదరాబాద్ లో చదివేటపుడు మా అమ్మకు రాసిన ఉత్తరాలు ,  నా చిన్న నాటి నలుపు తెలుపు రంగు ఫోటోలు, బద్రంగా దాచుకుంది  అమ్మ అది రద్దీ కాదు మా అమ్మకు నా పైన ఉన్న ప్రేమ, అమ్మ దాచు కున్న జ్ఞాపకాలు బంగారం కన్నా  కోటి రెట్లు విలువైనవి, అమూల్యమైనవి . మారు ఆలోచించకుండా వాటన్నిటిని ఒక పద్దతిగా కూర్చి యదాస్థానం లో ఉంచాను. 


కళ్ళల్లో  తిరిగాయి ................ ఇంట్లో నా కాలు నిలువలేదు , వృద్దఆశ్రమం వైపు వడివడిగా వెళ్తున్నాను .......... అమ్మకోసం ...............................................




23, ఆగస్టు 2014, శనివారం

హాస్యానందం మాస పత్రికలో మూడవ బహుమతి పొందిన నా కార్టూన్ మొదటలో ఈ కార్టూన్ అన్ని పత్రికలూ సాదారణ ప్రచురణకు కూడా స్వీకరించలేదు . బహుమతి పొందిన తరువాత దీనికి చాలపేరు వచిన్ది. నాకు బహుమతి ప్రకటించిన హాస్యానందం సంపాదకులు రాము గారికి హ్రిదయపూర్వక ధన్యవాదములు .